రూ.5 కోట్ల పాత కరెన్సీ, జింకకొమ్ములు స్వాధీనం
► నలుగురి అరెస్టు
బనశంకరి (బెంగళూరు) : రద్దయిన పాత కరెన్సీనోట్లకు కొత్తనోట్లు ఇచ్చే చెలామణి దందాకు పధకం పన్నిన నలుగురు వ్యక్తులను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే పాత కరెన్సీనోట్లును స్వాధీనం చేసుకున్నారు. రాజాజీనగర శివాలిలాడ్జ్‌లో పాత కరెన్సీ నోట్లును చెలామణి చేయడానికి పధకం రూపొందించినట్లు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.
మంగళవారం సర్కిల్‌ఇన్స్‌స్పెక్టర్ రాజు బృంధం రాజాజీనగరలోని శివాలిలాడ్జ్ పై దాడిచేశారు. జయనగర కు చెందిన అంబ్రోస్, న్యూగురప్పనపాళ్య నివాసి ఆరీఫ్‌పాషా, కేరళ కు చెందిన పెలిక్స్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1 కోటి 98 లక్షల విలువచేసే రూ.500, 1000 పాత కరెన్సీనోట్లు, 2 కార్డు, మూడు సెల్‌పోన్లు తో పాటు లక్షలాదిరూపాయల విలువచేసే జింకకొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న అరుణ్, మంజునాథ్ అనే ఇద్దరిలో పరారిలో ఉన్నారని అదనపు పోలీస్ కమిషనర్ ఎస్.రవి తెలిపారు. వీరిపై రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. శంకరపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుల్‌టెంపుల్ రోడ్డులో గల మరాఠ హాస్టల్ పై సీసీబీ పోలీసులు దాడిచేసి శాంతినగర కు చెందిన నంజుండ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే పాతకరెన్సీనోట్లు, ఒక కారు, సెల్‌పోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతడి పై శంకరపుర పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు చేశారు.