old news papers
-
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
పాత పేపర్‌కు డిమాండ్ పెరిగిందండోయ్.. కిలో ఎంతంటే!
సాక్షి, ఆదిలాబాద్ : పాత పేపర్ ధర అమాంతగా పెరిగిపోయింది. కిలో ధర రూ. 35 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పాతపేపర్ కొరత ఉండడంతో గిరాకీ పెరిగింది. గతంలో కిలో రూ. 4 నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కాని కరోనా నేపథ్యంలో పేపర్ మార్కెట్లోకి రాకపోవడంతో డిమాండ్ పెరిగింది. ఇటీవల మండల కేంద్రానికి చెందిన వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను గుజరాత్ నుంచి కొనుగోళ్లు చేసి నిజమాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో విక్రయించారు. చదవండి: కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్ పేపర్ -
అందంగా... ఆకర్షణీయంగా... పేపర్ బ్యాగ్
మీరే పారిశ్రామికవేత్త పాత వార్తాపత్రికలను కత్తిరించి చక్కగా మడతపెట్టి జిగురుతో అతికిస్తే చక్కటి సంచి తయారవుతుంది. పాతికేళ్ల కిందట మందుల దుకాణాలతోపాటు చిన్న చిన్న కిరాణా దుకాణాలు విరివిగా ఉపయోగించిన కవర్లు ఇవే. అప్పట్లో అనేక కుటుంబాల్లో మహిళలు, పిల్లలు ఈ పని చేసుకుంటూ దుకాణాల్లో అమ్మి చేతి ఖర్చులకు డబ్బు సంపాదించుకునే వారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వచ్చిందో ఈ ఉపాధి అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అది పరిశ్రమ రూపు సంతరించుకుని మార్కెట్లో విహరిస్తోంది. ఈ పరిశ్రమ స్థాపించాలంటే... యాభై నుంచి ఎనభై లక్షల పెట్టుబడితో భారీ స్థాయిలో ప్రారంభించవచ్చు. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉత్పత్తికి చేత్తోనే చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఒకటి - రెండు గదులు సరిపోతాయి. లక్షా- రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. ముడి సరుకు సర్దుకోవడానికి, తయారైన వస్తువులను పెట్టుకోవడానికి ర్యాక్‌లు - రెండు (ఒక్కొక్కటి 2,500), అల్మైరా - ఒకటి (ఆరేడు వేలు), ఫోల్డింగ్ మెషీన్ (చేతితో పని చేసే చిన్న మెషీన్) - పది వేల లోపు. ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - 2, కత్తెర - 1, పెద్ద స్కేలు - 1, టేపు - 1 ఐదొందల్లో వస్తాయి. ముడిసరుకు... కనీసంగా కావల్సినవి పేపర్, ఐలెట్స్, త్రెడ్, ఫెవికాల్. ఆకర్షణీయంగా తయారు చేయడానికి అలంకరణలు పెంచుకోవచ్చు. అలాగే వినియోగదారుల అవసరాన్ని, వారి బడ్జెట్‌కి అనుగుణంగా సంచి తయారు చేసివ్వడం కోసం రకరకాల పేపర్లు అందుబాటులో ఉంచుకోవాలి. క్రాఫ్ట్ పేపర్, ఆర్ట్బోర్డు పేపర్, ఆర్ట్ కార్డ్ పేపర్, హ్యాండ్‌మేడ్ పేపర్... ఇలా చాలా రకాలుంటాయి. అలాగే కాగితం మందం కూడా ముఖ్యమే. శిక్షణ గురించి... భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘వందేమాతరం’ పథకం ద్వారా ఆసక్తి ఉన్న వారికి శిక్షణనిస్తోంది. ఎలీప్ సంస్థ నిర్వహిస్తోన్న ఈ శిక్షణ కార్యక్రమాలకు కనీస విద్యార్హత ఐదవ తరగతి ఉన్న 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు హాజరుకావచ్చు. నేర్చుకున్న తర్వాత... స్వయంగా పరిశ్రమ స్థాపించవచ్చు. ఇతర పరిశ్రమల్లో ఉద్యోగం పొందవచ్చు లేదా పరిశ్రమల నిర్వాహకుల నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి దగ్గరే తయారు చేసుకుని ఒక్కొక్క సంచి తయారీకి తగిన వేతనాన్ని (పీస్ లెక్కన) పొందవచ్చు. ఈ విధానంలో మార్కెట్ ఒత్తిడి ఉండదు. పరిశ్రమ స్థాపించి ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఎలీప్ సంస్థ ‘విపణి’ అనే కార్యక్రమం ద్వారా మార్కెట్ కల్పిస్తోంది. పని నేర్చుకుంటున్నాం... పని చేస్తున్నాం... మాది నల్గొండ జిల్లా హుజూర్నగర్. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసి ఫార్మా రంగంలో ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఎలీప్లో శిక్షణ తీసుకుని స్నేహితురాలితో కలిసి పరిశ్రమ ప్రారంభించాను. - వాసిరెడ్డి శిరీష, 9494428686 మార్కెట్ మీద పట్టు... మాది వరంగల్. శిరీష బాబు, మా పాప ఒకే క్లాస్ కావడంతో మాకు పరిచయమైంది. అప్పటికే శిరీష జైపూర్, మహారాష్ట్రలు తిరిగి పరిశ్రమ నిర్వహణ, ముడిసరుకు దొరికే ప్రదేశాలను తెలుసుకుంది - మడిశెట్టి అర్చన, 9642444450 శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ ఇలా... 1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో ఉదయం 11 గంటల నుంచి - సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి