old person dies
-
గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆన్ ది ఎర్త్ ఇక లేరు
Oldest Woman Kane Tanaka Dies: ప్రపంచంలో అత్యధిక వయసుతో పేరుబడ్డ వ్యక్తి ఇక లేరు. జపాన్‌కు చెందిన 119 ఏళ్ల కేన్ టనాకా.. సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. జనవరి 2, 1903లో పుట్టిన కేన్ టనాకా.. 2019లోనే ఈ భూమ్మీద అత్యధిక వయసున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డుల్లో ఎక్కారు. పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా సమస్యలతో ఆమె కన్నుమూసినట్లు ఒక ప్రకటన వెలువడింది. ఇదిలా ఉండగా.. జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వృద్ధుల సంఖ్య సుమారు 85 వేలమందికి పైనే ఉంది. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ఇందులో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది ఆడవాళ్లే ఉంటున్నారు. వాళ్ల ఆరోగ్య రహస్యాలపై, జీవన శైలిపై పరిశోధనలూ జరుగుతున్నాయి కూడా. -
గుడిసె దగ్ధం: వృద్ధుడు సజీవ దహనం
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం చెల్లాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కాగా ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. సిందిల సమ్మయ్య(80) అనే వృద్ధుడు మంటల్లో పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుడు రంగారావు (60) బుధవారం సాయంత్రం రాజీవ్ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొని అతడిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో రంగారావు ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.