పాత కరెన్సీ నోట్లు..ఓ తీపి కబురు
న్యూడిల్లీ: పెద్దనోట్ల మార్పిడికి రాం రాం పలికిన ప్రభుత్వం నిర్ణయంతో దిగాలుపడిన ప్రజలకు ఆర్బీఐ కొంత ఊరటనిచ్చింది. రద్దయిన రూ.500 మరియు 1,000 కరెన్సీ నోట్లు మార్పిడి సదుపాయం రిజర్వ్ బ్యాంక్ ఇండియా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అన్ని బ్యాంకుల్లోనూ రద్దయిన నోట్ల మార్పిడి సౌకర్యం అందుబాటులో లేనప్పటికీ.. తమ దగ్గర మార్చుకోవచ్చని వెల్లడించింది.
ప్రస్తుత నిబంధనల మేరకు ఈ పాత నోట్ల మార్పిడికి (మనిషికి రూ.2000 లు చొప్పున) అనుమతిని స్తున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ మార్పిడి సౌకర్యం ఇతర బ్యాంకుల కౌంటర్ల వద్ద అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.
కాగా పాతనోట్ల మార్పిడిని ఇకపై రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ప్రకటన జారీ చేసింది. అలాగే రూ.500 పాత కరెన్సీ నోట్ల ద్వారా కొన్ని చెల్లింపులకు డిసెంబర్ 15 దాకా గడువును పెంచిన సంగతి తెలిసిందే.