old woman killed
-
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
అంత్యక్రియలను అడ్డుకున్న ‘పంచాయతీ’
బుచ్చినాయుడుకండ్రిగ (చిత్తూరు జిల్లా): ‘పంచాయతీ’ ఎన్నికల సంగ్రామం ముగిసినప్పటికీ.. ఇంకా గ్రామాల్లో ఆ నిప్పుల కుంపటి చల్లారలేదు. ఎన్నికల సందర్భంగా తనకిచ్చిన మాట తప్పారనే కారణంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకుంది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని కొత్తపాళెం గ్రామంలో శ్మశానం పంట పొలాల మధ్యలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పొలాల్లో నుంచే మృతదేహాలను శ్మశానానికి తీసుకెళుతున్నారు. బుధవారం ముత్యాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి బయలు దేరారు. అయితే పొలాల దారి మొదట్లో కాపురం ఉంటున్న బుజ్జమ్మ తన పొలం దారి నుంచి శవాన్ని తీసుకెళ్లవద్దంటూ దారికి అడ్డంగా కంచెను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటా మని, గ్రామానికి రూ.10 లక్షలు ఇవ్వాలని గ్రామ పెద్దలు తీర్మానం చేసి..అనంతరం మాట తప్పి పోటీ పెట్టి మోసం చేశారని, కాబట్టి తన భూముల నుంచి శవాన్ని తీసుకుపోయేందుకు వీల్లేదని బుజ్జ మ్మ అడ్డుకుంది. దీంతో వృద్ధురాలి శవంతో మూడు గంటల పాటు ఎండలో రోడ్డుపైనే బంధువులు నిరీ క్షించాల్సి వచ్చింది. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడం తో ఆయన ఆదేశాల మేరకు తహసీల్దారు గణేష్, ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బుజ్జ మ్మకు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. -
టీడీపీ అరాచకం.. కారుతో తొక్కించి...
తుళ్లూరు (తాడికొండ) : రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో టీడీపీ వర్గీయులు రాక్షసంగా ప్రవర్తించారు. నెక్కల్లు గ్రామంలో నడకదారి విషయమై ఏర్పడిన వివాదంలో న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళుతున్న బీసీలను కారుతో తొక్కించేశారు. ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతిచెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పసుపులేటి భూపతిరావు, ఆలూరి బ్రహ్మయ్య ఇళ్ల మధ్య నడిచే దారి విషయంలో వివాదం చెలరేగింది. బీసీలైన భూపతిరావు, అక్కడున్న మహిళలను టీడీపీకి చెందిన ఆలూరి బ్రహ్మయ్య దుర్భాషలాడి మహిళలపై దాడి చేశారు. బాధితులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. రోడ్డుపక్కనున్న వారిపైకి కారు నడిపి.. పోలీసు స్టేషన్‌కు వెళ్లేందుకు రోడ్డు మీద ఆటోకోసం ఎదురుచూస్తున్న వారి మీదుగా ఆలూరు బ్రహ్మయ్య కొడుకు ఆలూరు సుధాకర్‌బాబు కారు నడిపి తొక్కించేశాడు. ఆ సమయంలో కారులో బ్రహ్మయ్య, అతడి మరో కుమారుడు ఆలూరి అజయ్, వారి బంధువు యర్రమాసు శ్రీనివాసరావు ఉన్నారు. కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో పసుపులేటి మహాలక్ష్మి (65) మృతి చెందింది. వీరమ్మ, పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తొలుత పరారైన నిందితులు తరువాత పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. -
భవనంపై నుంచి పడి వృద్ధురాలు మృతి
సాక్షి, మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నెం కోటయ్య భార్య విష్ణుప్రియ (65) తన ఇంటి పైనుంచి కిందపడి మృతిచెందింది. పై అంతస్తుకు వెళ్లిన ఆమె అక్కడినుంచి జారి కింద పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో గమనించిన కింది పోర్షన్లో అద్దెకు ఉండేవాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులను పిలిపించి కేసు నమోదు చేశారు. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని మృతురాలి కొడుకు తెలిపాడు. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలి మృతి
కోళ్లమిట్ట (సూళ్లూరుపేట) :రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని క్రేన్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన పట్టణంలోని కోళ్లమిట్ట వద్ద బుధవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కోళ్లమిట్టకు చెందిన పుత్తూరు నాగమ్మ (60) షార్రోడ్డును దాటుతుండగా అదే మార్గంలో క్రేన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్రేస్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.