పుష్కర ఘాట్లో వృద్ధురాలి మృతి
కొవ్వూరు: పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు పుణ్యలోకాలకు వెళ్లిన సంఘటన కొవ్వూరులోని గౌతమి ఘాట్ లో శుక్రవారం సంభవించింది.
నెల్లూరు జిల్లా మూలపేటకు చెందిన భాగ్యమ్మ (71) అనే వృద్ధురాలు శుక్రవారం పుష్కర స్నానంచేసి బయటికి వస్తుండగా స్పృహ కోల్పోయింది. గమనించి తొటి భక్తులు భాగ్యమ్మను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించారు.