Older age
-
వృద్ధాప్యంలో డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా?
మనిషి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు సహజం. వృద్ధాప్యమంటే మరోమారు బాల్యదశకు చేరినట్లేనని పెద్దలు చెపుతుంటారు. వయసు పెరిగి వృద్ధాప్యం ముదిరేకొద్దీ వారిని పసిపిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసుపైబడుతున్న కొద్దీ ప్రతి జీవిలో అనేక జైవిక మార్పులు జరుగుతుంటాయి. మనుషుల్లో వయసు మీరే కొద్దీ జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడడం, మతిమరుపు పెరగడం వంటివి గమనించవచ్చు. వృద్ధాప్యం ముదిరే కొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల ఆనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మెరుగైన ఆరోగ్య విధానాలు అందుబాటులోకి రావడంతో మనిషి జీవన ప్రమాణం పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాప్య సమస్యలకు పరిష్కారాలు కూడా పెరిగాయి. ఇప్పటికీ సమాజంలో వృద్ధుల పట్ల ఈసడింపు, చీదర ఎక్కువగానే గమనించవచ్చు. కానీ ప్రతిఒక్కరూ ఆ దశకు చేరుకోవాల్సిన వాళ్లేనని గుర్తించి పెద్దలపై, వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజ విచ్ఛిన్నం జరుగుతుందని మానవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులను భారంగా పరిగణించేవారు అసలెందుకు వృద్ధాప్యంలో సమస్యలొస్తాయో అవగాహన పెంచుకోవడం అవసరమన్నది నిపుణుల మాట. అలాగే ఎవరమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు సైతం ఈ అవగాహన ఉపయుక్తంగా ఉంటుంది. సో, జీవన సంధ్య వేళ సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం! వయోవృద్దుల్లో జీర్ణక్రియ మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఇది క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణతకు, కండరాల బలహీనతకు, అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తినేది కొంచమైన పౌష్టికాహారం తీసుకోవడం, ఒకేసారి ఎక్కువ తినలేకపోతే, కొద్దికొద్దిగా పలుమార్లు ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. దైనందిన ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహారాలను తగ్గించాలి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు సాధారణంగా వృద్ధాప్యంలో డిప్రెషన్ వస్తుంది. అంతవరకు ఎంతో చురుగ్గా తిరుగుతూ అందరినీ శాసించినవారు క్రమంగా నిస్సహాయత ఆవరించడంతో ఏపని చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతుంటారు. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నిరశా నిస్పృహలకుదారి తీస్తాయి. డిప్రెషన్‌ను అధిగమించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, కుటుంబం, స్నేహితుల సాయంతో ఉల్లాసంగా గడపడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్ ఛాయలు మనసులోకి రాకుండా చూసుకోవడం చేయవచ్చు. ఫుల్స్టాప్ పెట్టాలి. చిన్నప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చిన చెవులు, కళ్లు, నోరు వయసు ముదిరేకొద్దీ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. దీంతో చెవుడు, చూపు మందగించడం, పంటి సమస్యలు ఎదురవతుంటాయి. కళ్లజోడు, హియరింగ్ ఎయిడ్స్‌తో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వినికిడి, దృష్టి లోపాలను ముందస్తుగానే గుర్తించవచ్చు. అదేవిధంగా పెద్దయ్యేకొద్దీ వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో పళ్లు దెబ్బతినడం, నోరు పొడిబారడం, చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల మొదటి నుంచి డెంటల్కేర్పై దృష్టి సారించాలి. ధూమపానం, పాన్ పరాగ్, తంబాకు వంటి అలవాట్లకు ఫుల్స్టాప్ పెట్టాలి. మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, దేనిమీదైనా దృష్టి పెట్టాలన్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న జ్ఞాపక శక్తి చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్ది మతిమరుపు పెరగడం సహజం. ఈ మరుపు శృతిమించితే డిమెన్షియాగా మారుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తికి తోడ్పడే జీవ క్రియలన్నీ ఆగిపోతాయి. ఇంకా సమస్య తీవ్రమైతే ఆల్జీమర్స్‌కు దారితీస్తుంది. డిమెన్షియాను పూర్తిగా నయం చేసే మందులు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. డిమెన్షియాను కొంతమేర అధిగమించేందుకే డాక్టర్లు మందులు సిఫార్సు చేస్తారు. అందువల్ల 50 సంవత్సరాలు దాటినప్పటినుంచే మెదడుకు పదును పెట్టే వ్యాపకాలు, గేమ్స్లాంటివాటిని అలవాటు చేసుకోవాలి. వయసు మీరిపోయిందని ఊరికే కూర్చోకుండా ఏదో ఒక చేతనైన పని చేస్తుండాలి. మెదడుకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. కుటుంబంలో ఆప్యాయతలు బలంగా ఉంటే వృద్ధాప్యంలో డిమెన్షియాలాంటివి రాకుండా ఉంటాయని గుర్తించాలి. -
వయోవృద్ధులకు పెన్షన్ వెసులబాటు
విజయనగరం రూరల్ : వయోవృద్ధులైన పింఛన్‌దారులు బయోమెట్రిక్ వేసేందుకు ఇక నుంచి ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండా ప్రభుత్వం వెసులుబా టు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వినియోగదారులు సేవా కేంద్రం ఇన్చార్జి చదలవాడ ప్రసాదరావు పే ర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న వినియోగదారుల సేవా కేంద్రంలో వయోవృద్ధులతో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరా లు నిండిన వయోవృద్ధులు సబ్‌ట్రెజరీ అధికారికి పింఛన్ వెసులుబాటుకు దరఖాస్తు చేసుకుంటే సహాయకులను ఇంటి వద్దకే పంపించి వేలిముద్రలు తీసుకుంటారని చె ప్పారు. వేలిముద్రలు పడని వారు జీవించే ఉన్నామన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపా రు. ఈ పత్రాన్ని సహా యకులు ఇంటి వద్దకు వచ్చి తీసుకుంటారన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ యోవృద్ధులు వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స భ్యులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. -
ఆ బాబు నీడలు మాకొద్దు
ఒక వికలాంగురాలిగా నా అనుభవ పాఠాలతో చెబుతున్నాను. ప్రభుత్వాలిచ్చే సామాజిక పెన్షన్లను రాజకీయంగా చూడవద్దు. సామాజికంగా దెబ్బతిన్న వర్గాలకు ఇది చేయూత అనుకోండి. వారు భావితరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని మరవద్దు. అలా ఆలోచించే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నది నా కోరిక. వికలాంగులు, వయో వృద్ధులు, వితంతువుల ఆవేదన నుంచి వచ్చే ఏకైక మాట ఇది. ఒకింత బాసట కావాలని ఆశించే అభ్యర్థన ఇది. గెస్ట్ కాలం: సమాజంలో మెజారిటీ వికలాంగులు దయనీయస్థితిలో ఉన్నారు. వయో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఈ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వంద కూడా దాటని పెన్షన్ కోసం చెప్పులరిగేలా తిరిగే వాళ్లం. వైఎస్ పాదయాత్రలో అనేకమంది ఈ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగురాలిగా నాకూ ఏదో తెలియని అపనమ్మకం ఉండేది. దానికి బలమైన కారణాలూ న్నాయి. చంద్రబాబు తన హయాంలో తొమ్మిదేళ్లు ఉద్యోగ నియామకాలు నిలిపివేశారు. ఫలితంగా ఒక్క వికలాంగుడికీ ఉద్యోగం రాలేదు. ఆయన ఈ ద్రోహం చేసి ఉండకపోతే వికలాంగుల్లో కనీసం 50 శాతం మంది బాగుపడి ఉండేవారు. ఉద్యోగాల్లో చేరి ఉండేవారు. వైఎస్‌కు మేలు చేయాలని ఉన్నా... చంద్రబాబు చర్యలు అడ్డుగా నిలిచాయి. అప్పటికే అనేకమంది ఉద్యోగాల్లో చేరేందుకు వయోపరిమితి దాటిపోయారు. వయో వృద్ధుల పరిస్థితి ఇంతకంటే దారుణం. చంద్రబాబు కాలంలోని వరుస కరవు.. గ్రామీణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసింది. ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలోనే అంతరించాయి. ఖాళీ అయిన ఊళ్లు, వలసలు వెళ్లిన కొడుకులు ఆనాటి పరిస్థితి. దీంతో వయసు ఉడిగిన పెద్దలకు ఆసరా కరవైంది. పూట గడవడమే కష్టమనే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత హైటెక్ మోజులో యువత పట్టణాలకు ఎగబాకారు. అంతిమంగా వృద్ధులు నిరాశ్రయులయ్యారు. వితంతువుల స్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే భర్తలు కోల్పోయిన వారిని 2004కు ముందు పట్టించుకున్నదెవరు? పెన్షన్లు ఇవ్వడం వైఎస్ గొప్పతనమే. పెన్షన్లు పెంచడం, వాటిని నెలనెలా సక్రమంగా ఇవ్వడం వల్ల మాకు కొంతైనా ఊరట కలిగింది. ఆయన తర్వాత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. వికలాంగులు, వయోవృద్ధులకు ఇతర దేశాల్లో ప్రభుత్వాలే చేయూతనిస్తున్నాయి. మన దేశంలో మూడు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజకీయంగా ఆ మాత్రం కూడా లేదు. వితంతువులు, వికలాంగుల్లో అత్యధికులు నిరుద్యోగులు. వికలాంగుల్లో ఎక్కువ భాగం తెలంగాణలోనే ఉన్నారు. దీనికి ఫ్లోరైడ్ కూడా కారణం కావచ్చు. విద్య, వైద్యం అందరికీ అందాలని వైఎస్ చెప్పేవారు. ఆ దిశగా ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ వంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు. అయితే మహిళా వికలాంగులకు ఇవే చేయూతనిస్తాయని చెప్పలేం. వారి సమస్యలు వేరు. ప్రసూతి సమయంలో వారికి ఉండే ఇబ్బందులు భిన్నం. వయసు మీదపడే కొద్దీ వికలాంగుల ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఔషధాల వినియోగం పెరుగుతుంది. వృద్ధుల పరిస్థితీ ఇదే. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడిచ్చే పెన్షన్‌ను మరింత పెంచాలి. సామాజిక పెన్షనర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు. ఎన్నికల మేనిఫెస్టోలో వారి గురించి ఆలోచిస్తే చాలు. చంద్రబాబు ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించడం వల్ల ఒకతరం అవిటిదైపోయింది. ఇది గుర్తించి ఊరట కలిగిద్దామనుకున్నారు వైఎస్. తన ప్రయత్నాలు కార్యరూపం దాల్చేలోపే ఆయన లేకుండాపోయారు. ఆ తర్వాత పాలకులు కనీసం ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినా బాగుండేది. మా సానుభూతి వైఎస్వైపే ఉందనుకున్నారో ఏమో! అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మూడేళ్లుగా ఇవ్వడం లేదు నేను పుట్టుకతోనే వికలాంగుడను. కాలు పనిచేయదు. 75శాతం వికలత్వం ఉన్నట్టు సదరం క్యాంపులో వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేశారు. ఆయన ఉన్నంత వరకు పింఛన్లు సక్రమంగా ఇచ్చిన అధికారులు మూడేళ్లుగా సరిగా ఇవ్వడం లేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి తిరిగి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శివకుమార్, కొత్తపల్లి(హెచ్), నార్నూర్ వైఎస్ పుణ్యమాని.. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.75 వృద్ధాప్య పింఛన్ ఇచ్చేవాళ్లు. వైఎస్ పుణ్యమా అని అది రూ.200కు పెరిగింది. దీంతోనే బతుకుతున్నం. మాలాంటి ఎంతో మంది వృద్ధులకు వైఎస్సార్ అన్నం పెట్టిండు. వేలి ముద్రల పేరుతో ఇప్పుడు పింఛన్ ఇచ్చేందుకు పరేషాన్ చేస్తుండ్రు. వేలి ముద్రలు రాక పోవడంతో డబ్బులు సమయానికి దొరకడం లేదు. పోస్టాఫీస్ చుట్టూ తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. పింఛన్ పెంచిన రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. - హమీదా బేగం, వాంకిడి, ఆదిలాబాద్ పింఛన్‌తోనే బతుకుతున్నా.. నా భర్త చనిపోయి 20ఏండ్లయింది. ఆసరాగా ఎవరూ లేరు. మొదట్లో రూ.75 పింఛన్ వచ్చేది. రాజన్న వచ్చినంక రూ.200కు పెంచిండు. ఒకటో తారీఖు రాంగనే పంచాయతీకి పోయి పైసలు తెచ్చుకుంట. ఎన్నికల్లో గెలిసేటోళ్లు పింఛన్ పెంచాలి. రూ.700 ఇత్తే అండగా ఉంటది. - బోగ రాజమ్మ, వితంతు పింఛను లబ్ధిదారురాలు, బచ్చన్నపేట, వరంగల్ -
బాబు పాలనలో వృద్ధుల ఆకలి కేకలు
ముదిమి వయుసులో రూ.75 పింఛన్ కోసం చంద్రబాబు ప్రభుత్వంలో నరకం చూడాల్సి వచ్చేది. ఒక లబ్ధిదారుడు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్ ఇవ్వలేని దుస్థితి. 2002లో జరిగిన ఒక ఘటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. నెల్లూరుకు చెందిన 68 ఏళ్ల చింతల పుల్లవ్ము పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సర్కారు కరుణించలేదు. ఓ ‘తెలుగు తవుు్మడు’ చెబితే అప్పు చేసి మరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చింది పుల్లమ్మ. పడిగాపులే తప్ప చంద్రబాబును కలిసి గోడు చెప్పుకొనే భాగ్యం కలగలేదు. వారం పాటు నిరీక్షించాక ఆకలి భరించలేక పుల్లవ్ము భిక్షాటన చేయూల్సి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన వ్యూచింగ్ గ్రాంటునే సగానికి కోతవేసి రూ.75 చొప్పున విదిల్చిన ఘనుడు చంద్రబాబు.