Olivia Culpo
-
నాది ఎక్స్పోజింగ్ అయితే! మరి ఆమె చేసిందో?
సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చర్చలు నడవడం సహజం. మిస్ యూనివర్స్-2012 ఒలీవియా కల్పో తాజాగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకారం.. మెక్సికోలోని కాబో శాన్ లుకాస్ అనే రిసార్ట్‌కి తన సోదరి, బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె పైన టాప్‌తో డ్రెస్ వేసుకుని ఉంది. అయితే క్లీవేజ్ కనిపించేలా ఆ డ్రెస్సు ఉండడంతో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ మెక్కాఫెరే హూడీని తగిలించుకుని ఆమె ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు షాక్ తగిలింది. తనకంటే దారుణమైన దుస్తులతో ఉన్న మహిళను విమానంలోకి సిబ్బంది అనుమతించారు. దీంతో అక్కడి ఘటనతంతా వరుసగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఒలీవియా సోదరి అరోరా. తనకు ఎదురైన అమానం గురించి అందరికీ తెలియాలనే తాను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఓ మీడియా హౌజ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఒలీవియా. Come on! Who dresses like that to go on a plane. I’m glad @AmericanAir made her cover up. People today think they can just walk around scantily clad and we’re just supposed to accept it. @oliviaculpo dress like an adult. #teamamericanairlines — Missy (@melissa_U25) January 15, 2022 PR stunt, it's the simplest explanation. It worked too, BTW. — 🍊💊Jorj X McKie🍊💊 (@Jorj_X_McKie) January 15, 2022 Funny how the sister who thinks Olivia looks cute and appropriate is covered from head to toe. You look like you’re wearing a bra and spanks. Try adulting and put some actual clothes on. You’d think a former Miss Universe would have some standards. 🤷🏻♀️ — Angela (@hotstuffmedic) January 15, 2022 -
మిస్ యూనివర్స్ పోటీలో మానసి మోగి
రష్యాలోని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 ప్రిలిమినరీ పోటీలో భారత్ తరఫున మిస్ ఇండియా మానసి మోగి పాల్గొంది. క్రోకస్ సిటీ హాల్లో జరిగిన పోటీలో మానసి వినూత్న దుస్తులతో కనువిందు చేసింది. ఈ నెల 9న శనివారం జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఏ సుందరీమణి దక్కుతుందో తేలనుంది. ప్రిలిమినరీ పోటీలో స్విమ్ సూట్లో మిస్ ఇండియా మానసి మోగి. మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు. రష్యాలోని మాస్కోలో ఈ నెల 9న జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ 2013 కిరీటం కోసం క్రోకస్ సిటీ హాల్లో పోటిలో ఉన్న సుందరీమణులు. మిస్ యూనివర్స్-2013 మాస్కోలోని గ్రూప్ క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు. -
తీహార్ జైలును సందర్శించిన విశ్వసుందరి ఒలీవియా
విశ్వసుందరి ఒలీవియా ఫ్రాన్సెస్ కప్‌లో తీహార్ జైలును సందర్శించింది. జైల్లో జరుగుతున్న హరిత ఉద్యమాన్ని ఎంతగానో ప్రశంసించింది. మరొక్క ఏడాది గడిస్తే తీహార్ ఇంకెంత బాగుంటుందోనని వ్యాఖ్యానించింది. సెంట్రల్ జైలు నెం.2ను సందర్శించిన ఒలీవియా, అక్కడ రెండు గంటల పాటు గడిపింది. జైలు ఫ్యాక్టరీ, ఖైదీలు తయారుచేస్తున్న వివిధ వస్తువులు.. ఇలాంటి విశేషాలన్నింటినీ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) విమలా మెహ్రా దగ్గరుండి ఆమెకు వివరించారు. జైలులోని బ్యాండ్ నిర్వహించిన 'ఫ్లయింగ్ సోల్స్' అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఆమె చూసింది. మహిళలు, అమ్మాయిలపైన హింసకు పాల్పడకుండా ఉంటామని ఖైదీల నుంచి ఆమె మాట తీసుకున్నారు. ఆమెతోపాటు డిజైనర్ సంజనా జాన్ కూడా తీహార్ జైలుకు వచ్చారు. ఆడ శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్‌పై అవగాహన తదితర కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఈ అమెరికా సుందరి భారతదేశంలో పది రోజుల పాటు పర్యటిస్తోంది. -
సల్మాన్ ఖాన్ ను కలుసుకోనున్న మిస్ యూనివర్స్!
మిస్ యూనివర్స్ 2012 ఓలివియా కల్పో శుక్రవారం భారత పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో బాలికల సంక్షేమం కోసం నిధులను సేకరించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా కలువనున్నారు. భారత పర్యటనలో ఓలివియా వెంట డిజైనర్ సంజనా ఉంటారు. బాలికల సంక్షేమం, మహిళపై లైంగిక వేధింపుల వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని అన్నారు. బాలికల సంక్షేమం కోసం నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ తోపాటు లతా మంగేష్కర్, సంగీత దర్శకులు సాజిద్, వాజిద్ లు కూడా పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఈపర్యటనలో భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారని డిజైనర్ సంజనా తెలిపారు. అంతేకాక బాలీవుడ్ అంటే ఓలివియాకు ప్రత్యేక అభిమానం. పరిస్థితులు అనుకూలిస్తే.. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం ఉంది అని సంజనా తెలిపారు.