చౌతాలాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. చౌతాలా హరియాణా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవినీతి వ్యవహారంలో ట్రయల్ కోర్టు ఓంప్రకాశ్ చౌతాలాను, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాలను దోషులుగా నిర్ణయించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన చౌతాలాలకు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్.. చౌతాలాలకు 10 సంవత్సరాల జైలు శిక్ష సబబేనని వ్యాఖ్యానించారు.