Omega Hospitals
-
‘ఒమేగా’లో ఏఐ కేన్సర్ రేడియేషన్ మెషీన్
సాక్షి, హైదరాబాద్: ఒమేగా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా మరో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది. 500 పడకలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇక్కడ కేన్సర్ చికిత్సతోపాటు ఇతర అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కేన్సర్ రేడియేషన్ మెషీన్ (ఎథోస్)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గచ్చి బౌలిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐతో పనిచేసే ‘ఎథోస్’ రోగుల చికిత్సను ప్రారంభ దశ నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇది కేన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవమని చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చికిత్స అందించగలగడం దీని ప్రత్యేకత అన్నారు. దేశంలో డిజిటల్ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ సీటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రిగా ఒమేగా నిలిచిందని డాక్టర్ వంశీ వెల్లడించారు. ఐసీయూ, హై ఎండ్ క్యాథ్‌ల్యాబ్ సదుపాయాలతో 24 గంటలూ అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఈవో శ్రీకాంత్ నంబూరి, స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ రవి రాజు, డాక్టర్ గణేష్ మాథన్, డాక్టర్ విక్రమ్ శర్మ, డాక్టర్ ఆదిత్య కపూర్ పాల్గొన్నారు. -
ప్రేమించకుంటే.. ఇద్దరినీ పెట్రోల్ పోసి తగలేస్తా..
బంజారాహిల్స్: తనను ప్రేమించకపోతే పెట్రోల్ పోసి తగలేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కల్లకూరు గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్లో నివాసం ఉంటోంది. సమీపంలోని ఓమెగా ఆస్పత్రిలో 2014 నుంచి టెక్నికల్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఆస్పత్రికి వచ్చిపోయే సమయంలో అందులోనే గతంలో ఎలక్ట్రీషన్‌గా పనిచేసిన మహేష్ ఏడాది కాలంగా ప్రేమించాలంటూ వెంట పడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. తనను కాకుండా ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుంటే ఇద్దరినీ కలిసి పెట్రోల్ పోసి తగలేస్తానంటూ గత నెల మరోసారి ఎస్వీఆర్ స్కూల్ వద్ద అడ్డగించి బెదిరించాడు. రెండో రోజుల క్రితం మరోసారి ఫోన్ చేసి తనను ప్రేమిస్తావా లేకపోతే చస్తావా అంటూ హెచ్చరించాడు. తనను కాదని పెళ్ళి చేసుకుంటే అంతు చూస్తానంటూ బెదిరించడమే కాకుండా మానసికంగా వేధింపులకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మహేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు మహేష్‌పై సెక్షన్ 354(డి), 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డా||వి.అమర్‌తో ఒమేగా హెల్త్ ప్లస్
-
ఒమేగా హెల్త్ ప్లస్ 11th October 2013