ఓమిని వాహనం బోల్తా.. నలుగురికి గాయాలు
మడకశిర రూరల్ : కర్ణాటకలోని పావగడ తాలుకాలోని రాజవంతి గ్రామ సమీపంలో బుధవారం ఓమిని వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మడకశిర మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసుబాబు, తల్లి రత్నమ్మ, కోడళ్లు అనితమ్మ, విద్య తీవ్రంగా గాయపడ్డారు. నాగలమడకలో జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పావగడలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తరలించారు.