one time
-
పోలీసులు సమీక్షల్లో దొంగలు చోరీల్లో
వరంగల్ క్రైం/రామన్నపేట: చోరీలు, నేరాలను ఎలా కట్టడి చేయాలా..అని పోలీసులు ఓ పక్కన సమీక్షిస్తుండగా.. మరోపక్క అదే సమయంలో దొంగలు స్వైర విహారం చేసి దర్జాగా దోచుకుపోయిన ఘటనలు వరంగల్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నాయి. పోలీస్ కమిషనర్ రంగనాథ్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష జరుపుతుండగా అదే సమయంలో దొంగలు మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోని ఆరు ఫ్లాట్లలో చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 178 తులాల బంగారం, కొంత నగదు, వెండి అపహరించారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధి నయీంనగర్‌లోని కల్లెడ అపార్ట్మెంట్లో సుమారు 12 తులాలు, కిషనపురలోని లహరి అపార్ట్మెంట్లో 14 తులాలు, మారుతీ వాసవి అపార్ట్మెంట్లో 60 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ అపార్ట్మెంట్లో ప్రకాశ్‌రెడ్డికి చెందిన 401 ప్లాట్‌లో తాళం పగులగొట్టి 14 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేశారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రీ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో 52 తులాల బంగారంతోపాటు సుమారు రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. దాని పక్కనే ఉన్న వద్దిరాజు అపార్ట్మెంట్లో 39 తులాల బంగారం, రూ.22వేల నగదు అపహరించారు. ముఖాలకు మాస్క్ ధరించి చోరీ చేసిన తరువాత దుండగులు దర్జాగా వెళ్తున్న దృశ్యాలు ఆయా అపార్ట్మెంట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఒక కారులో వచ్చినట్లు తెలిసింది.వరంగల్ క్రైం/రామన్నపేట -
ఏడాది చివరి వరకు వన్‌టైమ్ సెటిల్మెంట్
కర్నూలు(అగ్రికల్చర్): మొండి బకాయిల వసూలులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బోర్డు సమావేశం నిర్ణయించింది. అలాగే 64 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం సర్వసభ్య సమావేశం కూడా ౖచెర్మన్ మల్లికార్జునరెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటైంది. దాదాపు రూ.4 లక్షల వ్యయంతో జిల్లాలోని అన్ని సహకార సంఘాల అధ్యక్షులకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను బహూకరించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద అప్పు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే డీసీసీబీ 35 శాతం భరిస్తుందని చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కో–ఆపరేటివ్ డెవలప్మెంటు ప్రాజెక్టు కింద జిల్లాకు రూ.143 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో సహకార సంఘాలకు రూ.124 కోట్లు, చేనేత సహకార సంఘాలకు రూ.3కోట్లు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు రూ.6కోట్లు, స్వయం సహాయ సంఘాలకు రూ.5కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఐబీపీఎస్ ద్వారా 64 స్టాఫ్ అసిస్టెంటు పోస్టులను భర్తీ చేయాలని తీర్మానించినట్లు వెల్లడించారు. yీ సీసీబీ ఖాతాదారులందరికీ రూపే కార్డులు, అరెకరా భూమి కల్గిన రైతులకూ రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి సీఈఓగా రామాంజనేయులు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు పూర్తిస్థాయి సీఈఓగా రామాంజనేయులును నియమిస్తూ బోర్డు సమావేశం తీర్మానం చేసింది. ఇంతవరకు ఇన్చార్జిగా ఉన్న ఈయన ఇటీవలే నోటిఫికేషన్ ద్వారా పూర్తిస్థాయి సీఈఓగా ఎంపికయ్యారు. కడిమెట్ల సహకార సంఘంలో పంట రుణం తీసుకొని మరణించిన ఎర్రకోట గ్రామానికి చెందిన కురువ వెంకటేశ్వర్లు భార్య పద్మావతికి జనతా బీమా కింద రూ.లక్ష చెక్కును చైర్మన్ అందచేశారు. కార్యక్రమంలో డీసీఓ సుబ్బారావు, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, చేనేత ఏడీ సత్యనారాయణ. డైరెక్టర్లు, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.