One Year Complete
-
మూడు రోజులు అనుకుంటే.. 365 రోజులయ్యింది!
లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ.. ఈ ఫిబ్రవరి 24వ తేదీకి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో ప్రాణాలను బలిగొంది ఈ యుద్ధం. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గబోడని.. అవసరమైతే మరో ఏడాదిపాటు కొనసాగిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ప్రజల జీవితాల పట్ల మాత్రమే కాకుండా.. తన సొంత సైనికుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. మేం ఇక్కడి పరిస్థితులను ఏడాది కాలంగా చూస్తున్నాం. లక్షా 88 వేలమంది రష్యా సైనికులు మరణించారు, గాయపడ్డారు. దీనికి పుతిన్ దూకుడు కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాకు సంబంధించి 97 శాతం ఉక్రెయిన్ యుద్ధంలోనే ఏడాదికాలంపాటు లీనమైందని, యుద్ధ ట్యాంకర్లలో మూడింట రెండోవంతు పూర్తిగా నాశనం అయిపోయాయని, అయినా కూడా ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడంలో పుతిన్ ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు బెన్ వాలెస్. అయినా పుతిన్ దురాక్రమణపై వెనక్కి తగ్గబోడని అంచనా వేశాడాయన. నరమేధం కొనసాగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పుతిన్ తన వైఖరి మార్చుకోకపోవచ్చనే అంటున్నారాయన. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దురాక్రమణకు పుతిన్ రష్యా బలగాలను ముందుకు పంపాడు. ఆ సమయంలో పుతిన్ లక్ష్యం ఒక్కటే. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించేసుకోవాలని. పైగా మూడే రోజుల్లో రాజధాని కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. తద్వారా యుద్ధం ముగుస్తుందని భావించాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. యుద్ధం 365 రోజులు సాగింది. తాను అనుకున్నవాటిల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయాడని వాలెస్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకారం.. ఈ ఏడాది కాలంలో ఎనిమిది వేల మంది సాధారణ పౌరులు మరణించినట్లు, 14 వేలమంది దాకా గాయపడినట్లు నివేదిక వెల్లడించింది. మేం గెలుస్తాం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఉక్రెయిన్ విజయం తధ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశాడాయన. మేము విచ్ఛిన్నం కాలేదు. అనేక పరీక్షలను అధిగమించాము. మేం గెలిచి తీరతాం అని అన్నారాయన. యుద్ధమనే చెడును మా దేశానికి తెచ్చిన వాళ్లను నిలువరించిన తీరతామని ధీమా వ్యక్తం చేశాడాయన. -
గల్వాన్ ఘర్షణలకు ఏడాది పూర్తి
-
‘అల వైకుంఠపురములో’ ఏడాది సంబరాలు..
-
ప్రజా పాలనకు ఏడాది
-
88 గెలిచి.. 103కు చేరి..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఉద్యమపార్టీగా 2014 ఎన్నిక ల్లో పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టింది. 88 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల చేరికల ద్వారా బలాన్ని మరింత పెంచుకుంది. గతేడాది డిసెంబర్ 13న సీఎంగా కేసీఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఐదేళ్లుగా మంత్రిమండలిలో మహిళలకు ప్రాతి నిధ్యం లేదనే విమర్శకు తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారంలో మరోమారు కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మూడో విడత విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కేబినెట్లో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉండటంతో పలువురు పార్టీ నేతలకు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు అప్పగించారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం గతేడాది డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల చేరికల ద్వారా బలాన్ని పెంచుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆల్ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తరపున గెలుపొందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎల్.రాములునాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పార్టీకి దూరంగా ఉంటూ టీఆర్ఎస్తో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి 19 మంది గెలుపొందగా, 12 మంది టీఆర్ఎస్ గూటికి చేరుకోవడంతో ఈ ఏడాది జూన్‌లో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లుగా, శాసనసభా కమిటీల్లో సీఎం కేసీఆర్ చోటు కల్పించారు. మిత్రపక్షంగా ఉంటున్న ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి దక్కింది. 40 మంది సభ్యులున్న శాసనమండలిలోనూ తన బలాన్ని టీఆర్ఎస్ గణనీయంగా పెంచుకోగా, మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రెండో పర్యాయం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల వ్యవధిలోనే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. లోక్‌సభలో మిశ్రమం.. స్థానికంలో ఏకపక్షం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను చవిచూసింది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 9 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఏఐఎంఐఎం ఒకచోట విజయం సాధించింది. అయితే ఈ ఏడాది మేలో జరిగిన స్థానిక సంస్థల్లో 32 జెడ్పీ చైర్మన్ స్థానాలతో పాటు, ఎంపీటీసీ ఫలితాల్లో 63 శాతం విజయాన్ని నమోదుచేసింది. హుజూర్నగర్ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీఆర్ఎస్ సెప్టెంబర్‌లో జరిగిన ఉపఎన్నికలో గెలుపొందింది. -
‘నేరెళ్ల’ గాయానికి ఏడాది
సిరిసిల్ల : జాతీయస్థాయిలో రాజకీయంగా రగిలిన నేరెళ్ల ఘటన ఇంకా సలుపుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగించిన ఘటన మానని గాయమైంది. సరిగ్గా నేటికి ఏడాది కిందట జూలై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని దళితుడు భూమయ్య మరణించిన ఘటన వివాదాస్పదమైంది. ఏడాదిగా బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అసలేం జరిగింది..! మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ఇసుకను తొలగించేందుకు మైనింగ్‌శాఖ టెండర్లు నిర్వహించింది. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిపోతుంది. ఇసుక లారీలతో ఏడాదిలో 42 ప్రమాదాలు జరిగాయి. అప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య ఇసుక లారీ ఢీకొ ని మరణించాడు. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడి చేశారు. తంగళ్లపల్లి ఎస్సై సైదారావు, కొందరు పోలీసులు గాయపడ్డారు. లారీ దహనం, పోలీసులపై దాడి చేసిన ఘ టనలో 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. జూలై 4న రాత్రి 11.30 గంటలకు నేరెళ్లకు చెం దిన పెంట బాణయ్య, కోల హరీష్, చెప్పాల బాల రాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్, జిల్లెల్లకు చెందిన కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్నుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరాకరించిన జైలర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిని జూలై 8న రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జైలర్ నిందితులపై గాయాలు చూసి జైలులోకి తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్తో జూలై 10న జైలుకు పంపించారు.వీరిలో నలుగురు తీవ్రఅస్వస్థతకు గురికాగా.. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జైలర్ నిందితుల ఆరోగ్యంగా లేరని నిరాకరించడంతో పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటన వెలుగులోకి వచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగంపై నిరసన.. జైలు ములాఖాత్‌లో తమ వారిని కలిసిన కుటుంబ సభ్యులు పోలీసుల దెబ్బలను చూసి చలించిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ తొలుత నిందితులను కలిసి పోలీసుల తీరును తప్పుబట్టారు. అంతకు ముందు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వారితో మాట్లాడారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రాములు నేరెళ్లకు వచ్చి బాధితుల గోడు విన్నాడు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కరీంనగర్, నేరెళ్ల, జిల్లెల్లకు వచ్చి బాధితులను పరామార్శించారు. సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టఫ్ ప్రతినిధులు, టీమాస్ ఫోరమ్ ప్రతినిధులు విమలక్క, రిటైర్డు జడ్జి చంద్రకుమార్, దళిత బహుజన సంఘాల నేతలు నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఇప్పటికీ బాధితులకు అండగా ఉంటూ.. న్యాయపోరాటానికి మద్ధతు ఇస్తున్నారు. బాధితులు మానవహక్కుల సంఘాన్ని, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వివాదాస్పదమైన పోలీసుల తీరు.. నేరెళ్ల ఘటనతో సిరిసిల్ల పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. అప్పటి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఇంటరాగేషన్‌లో స్వయంగా పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి సీసీఎస్ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్ చేశారు. ఎస్పీ విశ్వజిత్ కాంపాటి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బాధితులను వేములవాడలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నలుగురు బాధితులు మంత్రి కేటీఆర్ మాటకు విలువిచ్చి సరెండర్ అయ్యారు. మిగితా నలుగురు ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి టీఆర్ఎస్ సర్కారు తీరుపై నిరసన తెలిపారు.