'పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్‌కు చెప్పా'
ఒంగోలు : ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఒంగోలును సీమాంధ్రకు రాజధాని చేయాల్సింగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ ఇచ్చినట్లు ఆయన సోమవారమిక్కడ చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను కాంగ్రెస్‌కు చేసిన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని మాగుంట తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరపున పోటీ చేసేది త్వరలో వెల్లడిస్తాననని ఆయన చెప్పారు.
మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానిపై బుధవారం తిరుపతిలో ప్రకటన చేయవచ్చని తెలిసింది. సమైక్యాంధ్ర పేరుతో ఇప్పటికే రిజిస్టరైన ఒక రాజకీయ పార్టీని తీసుకుని, దానితో ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై నిన్న కాంగ్రెస్ బహిష్కత ఎంపీలు, కొందరు మంత్రులతో భేటీ అయ్యారు.