onion pakodi
-
వేడి వేడి ఉల్లి పకోడిలో కప్ప
సాక్షి, కుప్పం(చిత్తూరు) : ఉల్లి పకోడీలో కప్ప ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ.. ఇది నిజం. కుప్పం పట్టణం రాజీవ్ కాలనీలోని ఓ దుకాణంలో సోమవారం రాత్రి ఓ వినియోగదారుడు ఉల్లిపకోడీ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తింటుండగా పిండితో కలిసి మాడిపోయిన కప్ప చేతికి వచ్చింది. ఆ కుటుంబం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఉదయం పకోడి ప్యాకెట్ తీసుకువెళ్లి దుకాణదారున్ని ప్రశ్నిస్తే తప్పు జరిగిందని సమాధానం ఇచ్చాడు. తమ కుటుంబానికి ఎలాంటి హానీ జరగలేదని, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏంటని వినియోగదారుడు వాపోయాడు. మాంసపు దుకాణాలపై శానిటరీ అధికారుల దాడులు మదనపల్లె : మున్సిపల్ శానిటరీ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన, కుళ్లిపోయి పురుగులు పట్టిన మాంసాన్ని గుర్తించారు. వాసన వస్తున్న వాటిని రిఫ్రిజిరేటర్లో నిల్వచేసి సాయంత్రం వేళల్లో కబాబ్, చికెన్‌పకోడి చేసి విక్రయాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. పట్టణంలో మొత్తం 47 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 19 షాపుల్లో కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 19 కిలోల చికెన్, 7 కిలోల మటన్‌ను సీజ్ చేశారు. దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.7,800 జరిమానా వసూలు చేశారు. నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. పట్టణంలోని హోటళ్లలో సైతం తనిఖీ చేస్తామన్నారు. చికెన్, మటన్ దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, బహిరంగంగా మాంసాన్ని ప్రదర్శనకు ఉంచేటప్పుడు వాటిపై దుమ్ము పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వార్డు సచివాలయ శానిటరీ, ఎన్విరాన్మెంటల్ అధికారులు ప్రతిరోజు మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దాడుల్లో సచివాలయ సిబ్బంది జుబేర్, రాజారెడ్డి, సతీష్, రవీంద్రనాయక్ పాల్గొన్నారు. (చదవండి: పక్షుల కిలకిల.. మెరుగైన జీవవైవిధ్యం) -
సమ్‌థింగ్ స్పెషల్: పకోడీ
ఉల్లి పకోడీ, గోబీ పకోడీ, పాలక్ పకోడీ వీటినే మార్కెట్ చేస్తే మజా ఏముంటుంది. అందుకే పకోడీలలో వెరైటీలన్నింటినీ వండి వడ్డించాడు. బేబీ కార్న్ పకోడీ, ఎగ్ చెక్ బాల్స్ పకోడీ, బోన్‌లెస్ చికెన్ పకోడీ. ఇలా ఇరవై రకాల పకోడీలు హైదరాబాదీలకు రుచి చూపిస్తున్నాడు. చల్లని సాయంత్రం.. వాన కురిసే వేళ.. బాల్కనీలో నిల్చుని ఎంజాయ్ చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్లో వస్తున్న పాటను హమ్ చేస్తుంటే.. ఎంత హాయి. ఈ వెదర్‌కు కోడి కాని కోడి పకోడీ తోడైతే..! శనగ పిండి.. ఉల్లిపాయలు.. అందులో సన్న మిర్చి వేసి ముద్ద చేసి నూనెలో గోలించిన ఆ వేడి వేడి పకోడీలను వేళ్ల మీద ఆడిస్తూ అలా నోట్లో వేసుకుంటే ఆహా..! ఒకటి కాదు రెండు కాదు.. రకరకాల పకోడీలు రారమ్మని పిలుస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడ పకోడి స్నాక్ కాదు.. ఒక బ్రాండ్. అక్కడికి వెళ్తే ఇరవై రకాల వెరైటీలున్న మెనూ దర్శనమిస్తుంది. ఈ టేస్టీ ట్వంటీ పకోడీ ఫ్యాక్టరీ కర్త.. కర్మ.. క్రియ.. శ్యామ్ బొల్లిన. వైజాగ్‌కు చెందిన ఈయన హైయర్ స్టడీస్ చదివింది యూఎస్‌లో. యూకేలో ఎంబీఏ చేశాడు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్సయిన శ్యామ్ ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు. హైదరాబాద్ చేరుకుని తన వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. నలుగురూ వెళ్లే రూట్లో వెళ్తే థ్రిల్లేముంటుందని ఫిక్సయిన శ్యామ్.. ఉలిపికట్టెలా తనకు నచ్చిన రూట్లో వెళ్లాడు. ఎంబీఏ బుర్రకదా.. మార్కెటింగ్ సూత్రాలను ఓసారి రివైజ్ చేసుకున్నాడో ఏమో గానీ.., హైదరాబాద్‌లో అంతగా ప్రాచుర్యం లేని పకోడీల పని పట్టాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవు పకోడీలతో పందెం కోడిగా రంగంలోకి దూకాడు. వూదాపూర్, కూకట్పల్లి, జూబీ్లిహ ల్స్లలో స్టాల్స్ ఓపెన్ చేసి డిమాండ్‌కు తగ్గట్టు రుచులు పంచుతున్నాడు. ఇది ఓన్లీ ఫుడ్ స్టాల్ కాదు. ఇక్కడి పకోడీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చేలా డెవలప్ చేస్తున్నాడు. ఓన్లీ హైదరాబాద్‌లోనే కాదు.. తమ పకోడీలను బ్రాండింగ్ చేసి పక్క రాష్ట్రాల్లో కూడా మార్కెటింగ్ చేసే ఆలోచనలో ఉన్నాడు శ్యామ్. సొంతంగా రెసిపిలను ప్లాన్ చేసి.. దినుసులు కూడా సొంతంగా సమకూర్చుకుని పకోడీలు చేయడం వీరి ప్రత్యేకత.