Online entrance test
-
ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని ప్రైవేటు పీజీ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు (సీపీజీఈటీ) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇందులో 95.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు మొత్తం 60 ఉండగా, 53 కోర్సుల్లో ప్రవేశాలకు ఓయూ జూలై 8 నుంచి 20 వరకు నిర్వహించింది. సీట్ల సంఖ్య కంటే దర ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తక్కువగా ఉండటంతో 7 సబ్జెక్టులను మినహాయించారు. దీంతో 53 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేందుకు 90,354 మంది దరఖాస్తు చేసుకోగా, 78,032 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 74,815 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహత్మాగాం«దీ, పాలమూరు వర్సిటీలు, వాటి పరిధిలోని 264 కాలేజీల్లో 30,884 సీట్లు ఉన్నాయని వివరించారు. ఓయూ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని పీజీ సెంటర్ల తొలగింపుపై వర్సిటీలకు సమాచారం లేదన్నారు. ప్రవేశాలు తక్కువగా ఉన్న పీజీ సెంటర్లను తొలగించేందుకు కళాశాల విద్యా శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని, అయితే ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదన్నారు. తొలిసారిగా ఆన్లైన్లో.. మొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు ఓయూ రిజి్రస్టార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సెపె్టంబర్ ఒకటిన తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాం«దీ, పాలమూరు, తెలంగాణ వర్సిటీల్లో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
రేపు పీజీ డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్
ఏర్పాట్లు పూర్తి: హెల్త్ వర్సిటీ వీసీ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ డెంటల్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 6న నిర్వహించే ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ టి.రవిరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్వహించే ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. మొత్తం 556 సీట్లలో ప్రభుత్వ కళాశాలల్లోని 23 సీట్లతో పాటు మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 264(ఏయూ-96), ఓయూ-120, ఎస్వీయూ-48) సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది. ప్రైవేటు మేనేజ్మెంట్ కోటాలో 269 (ఏయూ-93, ఓయూ-132, ఎస్వీయూ-44) సీట్లు ఉన్నాయి. ఏపీలో విజయవాడలోని పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాలల్లో... తెలంగాణలో హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్టు, ఒరిజినల్ ఐడీ కార్డుతో ఉదయం 10.15 గంటల లోపు హాజరుకావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని వీసీ తెలిపారు. ఈనెల 7న ప్రాథమిక ‘కీ’, 15లోగా ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. -
ఎల్కేజీకీ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: నగరంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఎల్కేజీ, యూకేజీలకు ఆన్లైన్ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించేవారు. అనంతరం ఆ పద్ధతికి స్వస్తి పలికి ప్రవేశం కోరే విద్యార్థులకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు దానిని కూడా ఆన్‌లైన్‌కు మార్చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లోనే దరఖాస్తులను సమర్పించాలి. వీటిని పరిశీలించి, ఎంపిక చేసిన పిల్లలకు ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూన్ తొలి వారంలో పాఠశాలలను పునఃప్రారంభిస్తారు. అడ్మిషన్లకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తాము కోరుకున్న స్కూలులో సీటు దొరక్కపోతే...అనే సంశయంతో తల్లిదండ్రులు మూడు, నాలుగు పాఠశాలల్లో దరఖాస్తు చేస్తున్నారు. తమ పిల్లలను ఎల్కేజీ నుంచే ఇంగ్లీషు మీడియంలో చదివించాలని తాపత్రయ పడుతున్న తల్లిదండ్రులు రూ.లక్ష వరకు డొనేషన్ చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు. సీ బీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌లు బోధించే పాఠశాలల్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు డొనేషన్లను వసూలు చేయడం సర్వ సాధారణమై పోయింది. ఇలాంటి పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రుల విద్యార్హతలు కూడా అడ్మిషన్ల సందర్భంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారికి విధిగా ఇంగ్లీషు తెలిసి ఉండాలి. మరో వైపు పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను ప్రారంభించడానికి ముందు విద్యా హక్కు చట్టం కింద కేటాయించాల్సిన 25 శాతం సీట్ల వివరాలను స్థానిక విద్యా శాఖ అధికారులకు అందించాల్సి ఉంది. అధికారులు తుది జాబితాను ఖరారు చేసిన తర్వాత మాత్రమే ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఈ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప, తాముగా స్పం దించలేమని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.