ఇక మొబైల్ యాప్ రూపంలోనే ‘మింత్రా’
బెంగళూరు: ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్ మింత్రా మే 15 నుంచి మొబైల్ యాప్ రూపంలో మాత్రమే ఉండనుంది. ఇకపై డెస్క్‌టాప్, బ్రౌజర్ ఆధారిత షాపింగ్‌కు అందుబాటులో ఉండదు. దేశీయంగా భవిష్యత్ ఇంటర్నెట్ తీరుతెన్నులను అధ్యయనం చేసిన మీదట యాప్ ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చని భావిస్తున్నట్లు మింత్రా సీఈవో ముకేశ్ బన్సల్ తెలిపారు.