Online insurance policy
-
పీబీ ఫిన్‌టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫాం పాలసీబజార్, రుణాలకు సంబంధించిన పోర్టల్ పైసాబజార్‌ల మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ తాజాగా తమ పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ప్రతిపాదిత ఐపీవో నవంబర్ 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. షేరు ధర శ్రేణి రూ. 940–980గా ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ యశీష్ దహియా వర్చువల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,710 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, ఆఫ్‌లైన్‌లో కూడా విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు దహియా పేర్కొన్నారు. అలాగే వ్యూహాత్మక పెట్టుబడులు .. కొనుగోళ్లకు, విదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికల కోసం కూడా కొంత మేర నిధులు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్హోల్డర్లు దాదాపు రూ. 1,960 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా 75 శాతం భాగాన్ని అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. -
ఆన్లైన్లో పాలసీ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
సాక్షి న్యూఢిల్లీ: ఆన్లైన్లో బీమా పాలసీల అమ్మకాలు ఇటీవలి కాలంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. డేటా, స్మార్ట్ఫోన్ల అందుబాటు ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగేందుకు దోహదం చేస్తోంది. అయితే, సరిగ్గా ఈ అనుకూలతలను వినియోగించి మోసాలకు పాల్పడే అప్లికేషన్లు, వెబ్ పోర్టళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో బీమా పాలసీలు కొనుగోలు చేసే వారు సంబంధిత పోర్టల్‌కు బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గుర్తింపు ఉందా అని పరిశీలించుకోవడం అవసరం. www.irdaionline.org అనే వెబ్సైట్ నుంచి బీమా పాలసీలను కొనుగోలు చేయవద్దంటూ తాజాగా ఐఆర్డీఏఐ నోటీసు జారీ చేసింది. ఇది ఒక నకిలీ వెబ్ పోర్టల్ అని, బీమా పాలసీలను విక్రయించే అనుమతి లేదని స్పష్టం చేసింది. ఐఆర్డీఏఐ అధికారిక వెబ్ పోర్టల్ www.irdaonline.org అని గుర్తు చేసింది. తగిన రిజిస్ట్రేషన్ లేకుండా బీమా ఉత్పత్తులను విక్రయించే సంస్థలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. -
చౌకవైనా.. భేషైనవి
మొట్టమొదటి పూర్తిస్థాయి ఆన్లైన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన కంపెనీ ఉద్యోగిని కావడంతో.. వీటి ప్రీమియాల గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు, కస్టమర్ల నుంచి అనేక ప్రశ్నలు నాకు ఎదురవుతుంటాయి. ఇంత చౌకగా ఉందంటే.. కచ్చితంగా ఎక్కడో ఏదో ఒక లొసుగు ఉండే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా క్లెయిముల విషయానికొచ్చినప్పుడు కంపెనీలు ఏదో ఒక రకంగా ఎగ్గొట్టేస్తాయేమోనన్న భయం అన్నింటినీ మించి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ఇంతకు మించిన అనవసర భయం మరొకటి లేదని చెప్పవచ్చు. జీవిత బీమా వ్యాపారం అనేది దీర్ఘకాలికమైనది. క్లెయిములు సరిగ్గా చెల్లించదన్న ప్రచారం జరిగిందంటే ఏ కంపెనీ కూడా మార్కెట్లో మనుగడ సాగించలేదు. అందువల్ల, సిసలైన క్లెయిములన్నిటినీ చెల్లించడం తమ బాధ్యతన్న విషయం ప్రతి కంపెనీ గుర్తెరిగి వ్యవహరిస్తుంది. ఆన్లైన్ ప్రపోజల్ ఫారంలో కంపెనీ బోలెడన్ని వివరాలు సేకరిస్తుంది కాబట్టి సిసలైన క్లెయిమును నిరాకరించడానికి అసలు అవకాశమే లేదు. మరి సంప్రదాయ పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ టర్మ్ ప్లాన్ ఎందుకు చౌకగా ఉంటుందంటే... * అమ్మకాలపరంగా మధ్యలో ఎవరికీ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కంపెనీకి పంపిణీ ఖర్చులు తగ్గిపోతాయి. దీంతో ప్రీమియంను తక్కువ చేయొచ్చు. * పాలసీ జారీ ప్రక్రియలో సింహభాగం ఆన్లైన్లోనే జరిగిపోతుంది. పేపర్, స్టేషనరీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రయోజనాన్ని పాలసీదారుకు బదలాయించడానికి సాధ్యపడుతుంది. * ఆన్లైన్ కస్టమర్ల ప్రొఫైల్‌ని బట్టి పాలసీలు తీసుకునే వారి సగటు జీవితకాలం, వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలపై అంచనాలు మెరుగుపడగలవు. తర్వాత కాలంలో ప్రీమియంలను క్రమబద్ధీకరించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే ఆన్లైన్ టర్మ్ ప్లాన్లు ఆఫ్‌లైన్ ప్లాన్ల కన్నా చౌకగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాలసీలు.. అందుబాటు ప్రీమియంలతో గణనీయమైన జీవిత బీమా కవరేజీ అందిస్తూ చెప్పుకోతగిన సేవలందిస్తున్నాయి. కనుక కస్టమరు చేయాల్సిందల్లా తమకు ఎంత కవరేజీ కావాలో నిర్ణయించుకోవడం, కొన్ని సులభతరమైన ప్రశ్నలకు సమాధానమివ్వడం, కీలకమైన వివరాలేమీ దాచిపెట్టకుండా తెలియజేయడం, అటుపైన ప్రీమి యం చెల్లించడమే. తద్వారా కుటుంబానికి తగినంత ఆర్థికపరమైన భద్రత కల్పించారు కనుక.. ఇక ఆ తర్వాత నిశ్చింతగా కాలు మీద కాలేసుకుని ధీమాగా ఉండొచ్చు.