![Consumer Alert Are you buying online insurance from this fake website? - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/17/fraud.jpg.webp?itok=CL9qt7hc)
సాక్షి న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో బీమా పాలసీల అమ్మకాలు ఇటీవలి కాలంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. డేటా, స్మార్ట్‌ఫోన్ల అందుబాటు ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరిగేందుకు దోహదం చేస్తోంది. అయితే, సరిగ్గా ఈ అనుకూలతలను వినియోగించి మోసాలకు పాల్పడే అప్లికేషన్లు, వెబ్ పోర్టళ్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బీమా పాలసీలు కొనుగోలు చేసే వారు సంబంధిత పోర్టల్‌కు బీమా అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) గుర్తింపు ఉందా అని పరిశీలించుకోవడం అవసరం.
www.irdaionline.org అనే వెబ్‌సైట్ నుంచి బీమా పాలసీలను కొనుగోలు చేయవద్దంటూ తాజాగా ఐఆర్‌డీఏఐ నోటీసు జారీ చేసింది. ఇది ఒక నకిలీ వెబ్ పోర్టల్ అని, బీమా పాలసీలను విక్రయించే అనుమతి లేదని స్పష్టం చేసింది. ఐఆర్‌డీఏఐ అధికారిక వెబ్ పోర్టల్ www.irdaonline.org అని గుర్తు చేసింది. తగిన రిజిస్ట్రేషన్ లేకుండా బీమా ఉత్పత్తులను విక్రయించే సంస్థలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment