OP Chautala
-
మాజీ సీఎం ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: నగదు అక్రమరవాణా కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు చెందిన రూ.1.94 కోట్ల ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. భూమి, ఫాం హౌస్‌లను అటాచ్ చేసింది. ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారులు అజయ్, అభయ్‌తో పాటు మరికొందరిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఈడీ చర్యలు చేపట్టింది. అయితే గత నెలలోనే రూ.3.68 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. -
ఆ తీర్పు సరైనదే.. చౌతాలా కేసులో ఢిల్లీ హైకోర్టు
ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం విషయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలా, ఆయన కుమారుడు మరో 53 మందికి కిందిస్థాయి కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. 2000 సంవత్సరంలో దాదాపు 3,206మంది జూనియర్ టీచర్ నియామకాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని వారికి పదేళ్ల జైలు శిక్ష పడింది. మరికొంతమందికి నాలుగేళ్లు, ఇంకొందరికి ఐదేళ్ల శిక్ష పడింది.