Open cast coal mines
-
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్.వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. -
బ్లాస్టింగ్ భయం
గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా) : సింగరేణి ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్–3 ప్రాజెక్టులో బొగ్గును వెలికితీసేందుకు ముందు దాని పైన ఉన్న మట్టిని తొలగించేందుకు చేసిన బ్లాస్టింగ్‌తో గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంటి రేకులు పగిలిపోయాయి. ఇదే క్రమంలో ఓసీపీ బండరాయి కూడా వచ్చి పడగా, త్రుటిలో బాలికకు ప్రాణాపాయం తప్పింది. విఠల్‌నగర్‌లో నివాసముండే కత్తెరవేన కుమార్, కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం 3.30 నుంచి 4 గంటల మధ్యలో ఓపెన్‌కాస్ట్–3లో పీసీ పటేల్ అనే ఓవర్‌బర్డెన్ కంపెనీ మట్టి కోసం బ్లాస్టింగ్ చేసింది. ఒక్కసారిగా కుదుపులతో కూడిన బ్లాస్టింగ్ జరగగా, ఇంటి రేకులపై బండపడడంతో అది పగిలిపోయి మంచంపై పడింది. అదే సమయంలో కుమార్ కూతురు ఆరేళ్ల కార్తీక మంచంపై ముందుకు వంగి హోంవర్క్ చేసుకుంటున్నది. రేకు పగిలిపోయి అందులో ఉన్న వచ్చిన బండ ఆమె వీపుపై వచ్చి పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇంట్లో వారంతా హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. కాలనీవాసులు కూడా ఆ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవేళ బండ బాలిక తలపై పడితే ఆమె ప్రాణానికే ముప్పు ఏర్పడేదని స్థానికులు పేర్కొన్నారు. ఓసీపీ–3లో బ్లాస్టింగ్ వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, విఠల్‌నగర్‌లో తాము బతుకుడా, లేక సచ్చుడా అని పలువురు కాలనీవాసులు సాయంత్రం ప్రాజెక్టులోపలికి వెళ్ళి రహదారిపై బైఠాయించి ఓబీ కంపెనీ వాహనాలను నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని కూర్చోవడంతో ఓబీ కంపెనీ ప్రతినిధులు బాధితుడి ఇంటికి వచ్చి పరిశీలించారు. కంపెనీ తరఫున సోమవారం కూడా వచ్చి పరిశీలిస్తామని, అవసరమైన సహకారాన్ని అందిస్తామని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
కరీంనగర్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు
జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. మహదేవ్పూర్ మండలంలో పెద్దంపేట, సర్వాయిపేట, వంకెన వాగులు పొంగిపొర్లుతుండడంతో 17 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్మపురి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సింగరేణి రామగుండం రీజియన్‌లో నాలుగు ఓపెన్ కాస్ట్ బొగ్గుపనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. -
పంట భూములను లాక్కోవద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పేరుతో రైతుల పంట భూములను లాక్కోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పంట భూములను తీసుకోవడం.. ఇళ్లను కూల్చడం వంటి సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.