పంట భూములను లాక్కోవద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పేరుతో రైతుల పంట భూములను లాక్కోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పంట భూములను తీసుకోవడం.. ఇళ్లను కూల్చడం వంటి సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.