open markets
-
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు మార్చి 31న కూడా తెరిచే ఉంచాలని సూచించింది. మార్చి 31న పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంక్ బ్రాంచులను తెరిచే ఉంచాలని వెల్లడించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యాన్వల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఆ రోజునే ఉంటుంది. ఇదీ చదవండి: Hindenburg's report: చాలా అకౌంట్లు ఫేకే! హిండెన్‌బర్గ్‌కు చిక్కిన ‘బ్లాక్’ బాగోతం ఇదే.. మార్చి 31, 2023న సాధారణ పని వేళల వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది-కౌంటర్ లావాదేవీల కోసం సంబంధిత శాఖలను తెరిచి ఉంచాలని అన్ని బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ తన లేఖలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోపు లెక్కించాలని ఏజెన్సీ బ్యాంకులను ఆదేశించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ద్వారా లావాదేవీలు మార్చి 31 అర్ధరాత్రి 12 వరకు కొనసాగుతాయి. ఇదీ చదవండి: పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు! అంతేకాకుండా ప్రభుత్వ చెక్కులకు సంబంధించి మార్చి 31న స్పెషల్ క్లియరింగ్ కూడా నిర్వహించాలని సూచించింది. దీనికి సంబంధించి ఆర్బీఐకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్) కీలక ఆదేశాలు జారీ చేయనుంది. GST/TIN2.0/e రిసిప్ట్స్ లగేట్ ఫైల్స్ అప్లోడింగ్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి మార్చి 31 రిపోర్టింగ్ విండో ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఖాళీ ప్రదేశాలకు రైతుబజార్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరిన్ని ముమ్మర చర్యలు చేపట్టింది. చాలా చోట్ల ప్రజలు నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్ల కోసం గుంపులుగుంపులుగా వస్తున్న దృష్ట్యా, దీన్ని నిరోధించడానికి రైతుబజార్లను విశాల ప్రదేశాలకు, ఖాళీ ప్రదేశాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న క్రీడా మైదానాలు, బస్టాండ్లు, కళాశాల, పాఠశాల ల ప్రాంగణాల్లో కూరగాయల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే హైదరాబాద్ చింతలబస్తీల్లోని మార్కెట్‌ను పక్కనే ఉన్న రాంలీలా మైదానంలో తరలించారు. సంగారెడ్డిలో సైతం కలెక్టరేట్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయల అమ్మకాలు చేపట్టగా, కరీంనగర్ బస్టాండును మార్కెట్‌గా మార్చేశారు.చాలా చోట్ల ఇదేమాదిరి రైతుబజార్లను తరలించి కొనుగోలుదారుల మధ్య సామాజిక దూరం ఉండేలా మార్కింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన రైతుబజార్లను జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టారు. దీనిద్వారా ఎక్కడివారికి అక్కడే నిత్యావసరాలు అందుబాటులోకి తేవడంతోపాటూ గుంపులను నివారించే చర్యలు తీసుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్‌లపై ఆంక్షలు.. ఇక లాక్డౌన్ పేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ బు కింగ్‌లకు డిమాండ్ పెరగడంతో ఆయిల్ కం పెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. విని యోగదారులు ఒకటికి మించి ఎక్కువ గ్యాస్ బుకింగ్‌లు చేయకుండా పలు ఆంక్షలు విధించాయి. ఒక బుకింగ్ జరిగాక, రెండో బుకింగ్‌కు కనీసం 14 రోజుల గ్యాప్ ఉండేలా ఆంక్ష లు తెచ్చాయి. ఈ మేరకు హెచ్‌పీ, భారత్‌గ్యాస్, ఇండేన్ గ్యాస్‌లు నిర్ణయం తీసుకున్నా యి. గతంలో కేవలం ఒక్క రోజు తేడాతో రెండో బుకింగ్‌కు సైతం సిలిండర్ సరఫరా చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతుండటం, వినియోగదారులు రెం డుమూడు సిలిండర్లను బుక్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు ఫలితాలనిస్తా యని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క కేంద్రం ఉజ్వల పథకం కింది లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనూ బుకింగ్‌లు పెరగడంతో కంపెనీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. -
హీరో ఆరో ప్లాంట్.. దక్షిణాదిన
స్థలం కోసం అన్వేషణ కంపెనీ సీఈవో పవన్ ముంజాల్ సావో పాలో: హీరో మోటోకార్ప్ ఆరో ప్లాంట్‌ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దక్షిణ భారతదేశ మార్కెట్ అవసరాలను తీర్చడం లక్ష్యంగా అక్కడ ఆరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ చెప్పారు. స్థలం కోసం అన్వేషిస్తున్నామని చెప్పిన ఆయన ఎప్పటికల్లా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ మూడు ప్లాంట్లు-ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, హర్యానాలోని గుర్గావ్, దారుహెరల్లో టూవీలర్లను ఉత్పత్తి చేస్తోంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 69 లక్షలు. నాలుగో ప్లాంట్‌ను రూ.400 కోట్ల పెట్టుబడులతో రాజస్థాన్‌లోని నీమ్రాణాలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 76.5 లక్షలు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ట్రయల్ రన్ నడుస్తోందని, త్వరలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ముంజాల్ పేర్కొన్నారు. ఇక గుజరాత్‌లోని హలోల్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో ఐదో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 18 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయనున్న ఆరో ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్లకు పెరుగుతుంది. కాగా దేశీయంగా తమ వాహనాలు మంచి అమ్మకాలు సాధించగలవన్న ధీమాను పవన్ ముంజాల్ వ్యక్తం చేశారు. మరోవైపు తాము క్రీడలకు సంబంధించి టీమ్‌ను కొనుగోలు చేసే యోచనేదీ ప్రస్తుతానికి లేదని, కేవలం స్పాన్సరర్లుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఫుట్‌బాల్ క్రీడ అంటే ఇష్టమని వివరించారు.