Opener Hashim Amla
-
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; 3 సిక్సర్లు)తో కలిసి ఆమ్లా రెండో వికెట్‌కు 185 పరుగులు జత చేశాడు. వీరిద్దరు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మిల్నే, మెక్లెనెగాన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కివీస్ 48.1 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లాథమ్ (80 బంతుల్లో 60; 4 ఫోర్లు; 1 సిక్స్), విలియమ్సన్ (69 బంతుల్లో 47; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. స్టెయిన్, ఫిలాండర్, తాహిర్, వీస్ రెండేసి వికెట్లు తీశారు. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 23న జరుగుతుంది. -
ఆమ్లా, రోసౌ శతకాల మోత
* దక్షిణాఫ్రికా భారీ విజయం * విండీస్‌పై 4-1తో సిరీస్ కైవసం సెంచూరియన్: సిరీస్‌లో రెండోసారి ఓపెనర్ హషీమ్ ఆమ్లా (105 బంతుల్లో 133; 11 ఫోర్లు; 6 సిక్సర్లు), రిలీ రోసౌ (98 బంతుల్లో 132; 9ఫోర్లు; 8 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో వెస్టిండీస్‌తో జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 131 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బుధవారం సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 42 ఓవర్లలో ఐదు వికెట్లకు 361 పరుగులు సాధించింది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్లు తగ్గించారు. ఆమ్లా, రోసౌ మూడో వికెట్‌కు 247 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. రస్సెల్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ 37.4 ఓవర్లలో 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గేల్ వెనుదిరగ్గా... శామ్యూల్స్ (47 బంతుల్లో 50; 1 ఫోర్; 4 సిక్సర్లు), నర్సింగ్ డియోనరైన్ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. వేన్ పార్నెల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. రోసౌకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.