ఉత్పత్తిలో దూసుకెళ్తున్న నూతన ప్రాజెక్టు
ఓసీపీ-3 ఫేజ్-2లో ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి
పుష్కలంగా బొగ్గునిల్వలతో అధికారుల్లో ఆనందం
యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో పురుడుపోసుకున్న నూతన ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో దూసుకపోతోంది. సింగరేణి సంస్థ రామగుం డం డివిజన్-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టు ఫేజ్-2లో గతేడాది నవంబర్ 23న డెరైక్టర్ మనోహర్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్స వం జరుపుకొని అనతికాలంలోనే బొగ్గు ఉత్పత్తిలో దూసుకపోతోంది. ఇప్పటివరకు 25లక్షల ఓబీ లక్ష్యానికి గాను 23.80లక్షల క్యూబికల్ మీటర్ల ఓబీ వెలికితీశారు.
5లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.11లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి నిర్ధేశిత లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్నారు. కొత్త ప్రాజెక్టు ప్రారంభానికి తోడు బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండటంతో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నా రు. బొగ్గు ఉత్పత్తికి తగినట్లుగా కోల్యార్డును ఏర్పాటు చేసి తీసిన బొగ్గు నిల్వలను భద్రపరుస్తున్నారు. పూర్తి ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతుండటంతో పేజ్-2 ప్రాజెక్టు పనితీరు పూర్తిస్థాయిలో సంతృప్తి కరంగాఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
వందశాతం ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నాం..
ఓసీపీ-3 పేజ్-2లో వంద శాతం ఉత్పత్తి ల క్ష్యాలను సాధిస్తున్నాం. నూతన ప్రాజెక్టు అనగానే ముందుగా భయపడినప్పటికి అన్నీ సజావుగానే కొనసాగుతున్నాయి. ఓబీ వెలికితీ, బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాం. ఈఏడాది మార్చి చివరినాటికి ప్రాజెక్టుకు కేటాయించిన ఉత్పత్తి ల క్ష్యాలను సాధిస్తాం. - జీఎం విజయపాల్‌రెడ్డి