Operation Epic Fury
-
ఇరాన్ యుద్ధం.. ప్రధాని మెలోని సంచలన నిర్ణయం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీ దాడులో ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. -
ఇరాన్‌పై అసహనం.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, అంతర్జాతీయంగా ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌పై విజయం సాధించాం. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా సైన్యం భారీ దాడిలో హతమయ్యారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టుతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి. అయితే, వీడియో విషయంలో స్పష్టత లేకపోవడం, ఎక్కడ దాడి జరిగిందనే విషయాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దాడి ఎలా జరిగింది? లక్ష్యాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, ఆ వీడియో నిజంగా ఇరాన్‌పై దాడికి సంబంధించదేనా? అనే విషయంపై అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు.ఏం జరగనుంది?మరోవైపు.. ఇరాన్‌పై ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్‌కు 48 గంటల గడువు ఇస్తూ, ఈలోగా ఒప్పందం చేసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిర్ణయం తీసుకోకపోతే భయంకర పరిణామాలు ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM ESTMany of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026కాగా, గతంలో కూడా ట్రంప్ ఇరాన్‌కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇంధన ప్లాంట్లపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా చెప్పారు. అయితే తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. చర్చలు సాగుతున్నాయన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా కఠిన హెచ్చరికల దిశగా అమెరికా మళ్లింది.ఇరాన్ కౌంటర్.. ఇదిలా ఉండగా.. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. ఈ క్రమంలో ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ తరఫున జనరల్ అలీ అబ్దొల్లాహి అలియాబాదీ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తోందన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్ ఆత్రుతతో వ్యాఖ్యలు చేశారని కౌంటరిచ్చారు. కాగా, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశం రెండు దేశాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో దీనిపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. -
యుద్ధంలో ట్విస్ట్.. ట్రంప్‌నకు ఇరాన్ మరో ఝలక్!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. మధ్యవర్తి దేశం పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదన పంపినప్పటికీ, టెహ్రాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు. దీంతో, యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా.. ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుబట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, మరో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు వార్తలు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అలాగే, ఒక F-15E స్ట్రైక్ ఈగుల్ విమానం కూలిన ఘటనలో ఒక సిబ్బందిని రక్షించగా, మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. మొత్తంగా, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.మరోవైపు.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై(IAEA) ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఐఏఈఏ ఖండించకపోవడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అణు శక్తి కేంద్రాలు శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నవని, వాటిపై దాడులను ఖండించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఐఏఈఏ మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, దాడులు చేసిన దేశాలకు మద్దతు ఇచ్చినట్టే అని ఘాటు విమర్శలు చేసింది. ముఖ్యంగా IAEA పర్యవేక్షణలో ఉన్న కేంద్రాలపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.కాగా, మార్చి 27న ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్‌పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ పనిచేయలేని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇదే రోజు ఆర్దకాన్ ప్రాంతంలోని యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రం కూడా దాడికి గురైంది. ఈ తరహా దాడులు రేడియోధార్మిక లీకేజీకి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, మానవీయ విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి. -
అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేస్తోంది.. -
భారత్‌కు రష్యా గుడ్ న్యూస్
ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్ర తరం చేసింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికాలో సంచలనం.. ఆర్మీ సైన్యాధిపతి తొలగింపు!
వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో, అమెరికాలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.వివరాల మేరకు.. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. తక్షణమే పదవీవిరమణ చేయాలని హెగ్సెత్ ర్యాండీకి తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే, అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గతేడాది యద్ధశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటినుంచి.. డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్‌ను, అడ్మిరల్స్‌ను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న జార్జ్‌ను తాజాగా తొలగించారు. ఇక, పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ ఛైర్మన్‌గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా.. తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ను కోరారు. -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయంకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు జరిపిన అమెరికా సైన్యం.. ఇకపై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు.. ఇరాన్ సైతం ప్రతిదాడులు జరుపుతోంది. ఇక, తాజాగా కువైట్‌పై ఇరాన్ జరిపిన దాడుల్లో భారత కార్మికుడు మృతి చెందాడు.వివరాల మేరకు.. కువైట్‌లో ఇరాన్ చేసిన దాడుల్లో ఓ భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడులలో భాగంగా కువైట్‌లోని ఒక ప్రధాన విద్యుత్, నీటి డీసాలినేషన్ ప్లాంట్‌లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారింది. ఈ దాడిలో భారతీయ కార్మికుడు మృతి చెందగా, భవనానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి వల్ల ప్లాంట్‌లోని ఒక భవనం దెబ్బతింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి నష్టం నియంత్రణ చర్యలు చేపట్టాయి.దీంతో పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన భారతీయుల సంఖ్య కనీసం ఎనిమిదికి చేరింది. ఇక, గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా ఒక భారతీయుడు క్షిపణి అవశేషాలు పడటంతో మరణించాడు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఏడు భారతీయులు మరణించారని, ఒకరు కనిపించలేదని తెలిపింది. తాజా ఘటనతో సంఖ్య పెరిగింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది. -
పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చ
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్.. -
ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్!.. ఇరాన్ పవర్ఫుల్ అటాక్
జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం టార్గెట్‌గా ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు కీలకమైన అణు కేంద్రం ఉండటం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక, ఈ ఘటనలో పిల్లలు సహా 100మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని పేర్కొంది. దీని వల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది. MAJOR IRANIAN ATTACK..Israel’s most secretive nuclear siteIn Dimona is on fire‼️Widely believed to be a nuclear research and weapons-related facility. pic.twitter.com/t6MSGsSAR2— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 21, 2026 నెతన్యాహు హెచ్చరిక.. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయం. గాయపడిన వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో శత్రువులను ఎదుర్కొంటాం. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పనిచేస్తున్న అత్యవసర సేవా బృందాలకు నెతన్యాహూ అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతం నుంచి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇరాన్ ఝలక్.. ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి స్పందించారు. ఇజ్రాయెల్ గగనతలం రక్షణ లేకుండా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల ఆకాశంపై ఇరాన్ మిసైల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇకపై జరగబోయే దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కమాండర్లను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.Video shows the moment an Iranian missile struck Dimona in southern Israel, home to the country’s nuclear facility. Nearly 50 people have been injured. Iran had warned it would target the area if the US and Israel pursued regime change in Tehran. pic.twitter.com/cPkzWskiw6— Al Jazeera Breaking News (@AJENews) March 21, 2026 -
బహ్రెయిన్ రాజుకు మోదీ ఫోన్..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. చమురు, గ్యాస్ ఉత్పత్తి, నిల్వ కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించడం అర్థరహితం అని తేల్చిచెప్పారు. ఆయన శుక్రవారం బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడారు.పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయని మోదీ ప్రస్తావించారు. షిప్పింగ్ మార్గాలకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగేలా పశ్చిమాసియా దేశాలు చొరవ తీసుకోవాలని సూచించారు. నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి వీలుగా సముద్ర మార్గాలను తెరవాలన్నారు. బహ్రెయిన్ రాజుతో ఫలవంతమైన చర్చ జరిగిందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాజుకు, బహ్రెయిన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశానని పేర్కొన్నారు.ఇంధన, పౌర మౌలిక వసతులపై దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువులు భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తేలి్చచెప్పారు. బహ్రెయిన్‌లోని భారతీయుల రక్షణకు తగిన చర్యలు చేపట్టినందుకు రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరాన్‌పై యొద్ధం మొదలైన తర్వాత బహ్రెయిన్ రాజుతో మోదీ ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. ఆయన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర దేశాల పాలకులతో ఇప్పటికే మాట్లాడారు. -
ఇరాన్ క్షిపణ శక్తిపై భీకర దాడులు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. -
అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఇరాన్ టార్గెట్ సక్సెస్
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు ఇరాన్ గట్టి షాకులే ఇస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ్2 యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ దాడి నిజమేనని అంగీకరించారు. దీంతో, అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది.వివరాల మేరకు.. అమెరికాను టార్గెట్‌ను చేసిన ఇరాన్ గురువారం (మార్చి 19న) ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌పై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)దాడులు చేసింది. తెల్లవారుజామున 2.50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా సదరు యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని పేర్కొంది. ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఇక, ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్లను సైతం 125కుపైగా కూల్చామని చెప్పింది. ఈ వివరాలను ఐఆర్జీసీ తమ అధికారిక వెబ్సైట్ వేదికగా గురువారం విడుదల చేసింది.అమెరికా రియాక్షన్..ఇరాన్ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు. ఈ సందర్బంగా తమ ఎఫ్-35 యుద్ధ విమానం ఒకటి పశ్చిమాసియాలోని ఓ వైమానిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని వెల్లడించారు. అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనతలం దిశగా వరుస మిస్సైళ్లను సంధించాకే, ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాత్మక శక్తి ఎఫ్-35 యుద్ధ విమానాలే అంటూ వైట్‌హౌస్ మార్చి 17న ఒక ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. దీన్నిబట్టి ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలలో కొత్త అప్గ్రేడ్లు జరిగి ఉండొచ్చని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు.ట్రంప్‌నకు వరుస షాక్లుపశ్చిమాసియా యుద్ధంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని కొన్ని ఇరాన్ వల్ల జరగుగా.. మరికొన్ని సాంకేతిక పొరపాట్లు కారణమయ్యాయి. కువైట్ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్‌లో ఏకంగా మూడు ఎఫ్-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని ఆరుగురు అమెరికన్ సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. గత వారమే ఇరాక్‌లోని పశ్చిమ ప్రాంతంలో కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్ సిబ్బంది చనిపోయారు. అయితే, ట్యాంకర్ విమానం ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు. -
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు యుద్ధం విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ సైనిక శక్తి ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిందని నెతన్యాహు తెలిపారు. ప్రజలు అనుకున్న దాని కంటే ముందే ఇరాన్ యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం జెరూసలేంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ 20 రోజులు పూర్తి చేసుకుంది. ఇరాన్ పాలకుల అణ్వాయుధ కలలను, క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మేము విజయం సాధిస్తున్నాం. ఇరాన్‌పై యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికంటే త్వరగానే ముగిసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. మొజ్తబా ఖమేనీ కనిపించలేదు. అగ్రస్థానం కోసం పాకులాడుతున్న వారిలో అంతర్గతంగా చాలా ఉద్రిక్తతలు ఉన్నాయని మనం చూస్తున్నాం.యురేనియం శుద్ధి చేయలేరు.. ఇరాన్ సైనిక యంత్రాంగం ప్రస్తుతం అతలాకుతలమైంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. కేవలం ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటిని తయారు చేసే పారిశ్రామిక పునాదులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. ఇరాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో, ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోగలిగాం. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయలేని స్థితిలో ఉంది. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయలేదు’ అని చెప్పుకొచ్చారు.దాడుల వెనుక మూడు లక్ష్యాలు.. అలాగే, ఇరాన్‌పై సైనిక చర్య వెనుక మూడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని నెతన్యాహు వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం, బాలిస్టిక్ క్షిపణి ముప్పును సమూలంగా నిర్మూలించడం, 47 ఏళ్లుగా అణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా పరిస్థితులను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఆకాశాన్ని రక్షించే వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని చెప్పారు. ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందన్నారు. కాస్పియన్ సముద్రంలో ఉన్న వారి నౌకాదళ విభాగంపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ సైనిక నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదని తెలిపారు.ట్రంప్‌పై ప్రశంసలు.. అమెరికాతో సంబంధాలపై నెతన్యాహు స్పందిస్తూ..‘ట్రంప్ నాయకత్వంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయం అమోఘం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రెండు వైమానిక దళాలు, అత్యుత్తమ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి’ అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధంలోకి లాగుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరని వ్యాఖ్యానించారు. -
ఇరాన్ కీలక అధికారి మృతి
ఇరాన్, ఆమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది... -
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌నకు భారీ ఊరట
లండన్: హార్మూజ్ జలసంధి నుంచి క్షేమంగా రాకపోకలు సాగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ప్రకటించాయి. ఈ విషయంలో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ఈ సందర్భంగా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్ సైన్యం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్‌లో నౌకల రాకపోలపై ఆంక్షల నేపథ్యంలో ఇంధన మార్కెట్లు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టంచేశాయి. ఈ విషయంలో సమన్వయంతో పని చేస్తామని తెలిపాయి. హార్మూజ్‌లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని తేల్చిచెప్పాయి. ఇందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తామని వివరించాయి. ఇంధన ఉత్పత్తి దేశాలతో కలిసి పని చేస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఉత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి.ఇరాన్‌పై ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమయ్యాయి. అందుకు ప్రతీకారంగా హార్మూజ్‌లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడం అత్యంత హేయమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ మండిపడ్డాయి. చమురు నౌకలతో ఇరాన్‌కు ముప్పు ఉంటుందా? అని ప్రశ్నించాయి. ఇకనైనా దాడులు ఆపాలని, హార్మూజ్ జలసంధిని ఇరాన్‌ను డిమాండ్ చేశాయి. ఇంధన సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుందని ఆందోళన వ్యక్తంచేశాయి. NEW: The UK alongside France, Germany, Italy, the Netherlands and Japan expresses readiness to contribute to appropriate efforts to ensure safe passage through the Strait of Hormuz 👇 https://t.co/KeCAbEbdWy pic.twitter.com/uqtRF394En— British Embassy Washington (@UKinUSA) March 19, 2026 -
అమెరికాకు ఇరాన్ ఝలక్.. ఖతార్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా ఖతార్, యూఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు.అయితే, సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. రస్ లాఫాన్ దాడి తరువాత తెల్లవారుజామున పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. దీంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. అగ్నిప్రమాదాలపై అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. అనంతరం, ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిప్రమాదాల్లో రెండింటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపింది. ఇంకా కూలింగ్, భద్రత చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది.ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్‌పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుతంగా ఉంటే, ఇకపై సౌత్ పార్స్ మీద ఎటువంటి దాడులు జరగవని ఆయన హామీ ఇచ్చారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా.. యుద్దం వేళ ట్విస్ట్!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్‌పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.టార్గెట్ అమెరికా.. అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.పాక్ పీఎం షరీఫ్ ఇలా.. అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్‌లో షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.ఇరాన్ యుద్ధంపై..మరోవైపు, ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు. -
ఇరాన్ యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్
గాంధీనగర్: ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో శుభవార్త అందింది. కాసేపటి క్రితమే హార్మూజ్ జలసంధి నుంచి మూడో నౌక జగ్‌లడ్కి షిప్ గుజరాత్ తీరానికి చేరుకుంది. దీంతో, భారత్‌కు చమురు కష్టాలు తీరనున్నాయి.వివరాల మేరకు.. జగ్‌లడ్కి నౌక బుధవారం ఉదయం వచ్చి ముంద్రా పోర్టుకు చేరుకుంది. సదరు నౌక యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి 80,800 మెట్రిక్ టన్నుల కూడ్రాయిల్ను మోసుకొచ్చిది. హార్మూజ్ జలసంధి నుంచి మూడో నౌక సేఫ్‌గా భారత్‌కు చేరుకుంది. ఇక, ఇప్పటికే ఎల్పీజీతో శివాలిక్, నందాదేవి నౌకలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. #WATCH | The Indian-flagged crude oil tanker 'Jag Laadki' arrived at Adani Ports Mundra in Gujarat.It carried approximately 80,886 metric tonnes (MT) of crude oil—sourced from the UAE—loaded at Fujairah Port. (Video Source: Adani Port) pic.twitter.com/5zeosrpVbp— ANI (@ANI) March 18, 2026ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎల్పీజీని మోసుకొచ్చిన శివాలిక్ ట్యాంకర్ సోమవారం భారత్‌లోని గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు వచ్చింది. ఈ శివాలిక్ నౌకలో 45,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు వచ్చింది. అలాగే పర్షియన్ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు రెండురోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. అందులో ఒకటి శివాలిక్ కాగా.. మరొకటి నందాదేవి. ఈ ‘నందాదేవి’ కూడా 45వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకొని కాండ్లా పోర్టుకు చేరుకుంది. -
హార్మూజ్ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్‌కు భారీ నష్టం?
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఫుల్ ఫోకస్ పెట్టింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.అమెరికా సైన్యం తాజాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో పటిష్టంగా ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై పలు 5,000-పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా పరిణమించాయి అని చెప్పుకొచ్చింది.Hours ago, U.S. forces successfully employed multiple 5,000-pound deep penetrator munitions on hardened Iranian missile sites along Iran’s coastline near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to international shipping in the… pic.twitter.com/hgCSFH0cqO— U.S. Central Command (@CENTCOM) March 17, 2026అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా, ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రవహించే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, జలసంధిపై ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలకు చమురు సరఫరా చేసే నౌకలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.శక్తివంతమైన బాంబు..2022లో ఎయిర్ ఫోర్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, బంకర్ బస్టర్ అని పిలవబడే ఈ బాంబుల ఖరీదు సుమారు $288,000. అయినప్పటికీ, గత సంవత్సరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వేసిన 30,000 పౌండ్ల (13,600 కిలోల) బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి. ఇవి సాధారణ బాంబులతో ధ్వంసం చేయలేని భూగర్భ బంకర్లు, కాంక్రీట్ కట్టడాలు వంటి గట్టి నిర్మాణాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.🇺🇸🇮🇷The U.S. unleashed the Massive Ordnance Penetrator, the 30,000-pound bomb.A.K.A. the bunker buster.This thing is engineered to slam through up to 200 feet of the toughest reinforced concrete before turning "buried and safe" into a myth…#iran #usa #dubai https://t.co/wtMI4obSkg pic.twitter.com/loQFtjDCIr— PROXY (@PROXY0b) March 14, 2026బాంబుల లక్షణాలుబరువు: సుమారు 2,267 కిలోలు (5,000 పౌండ్లు).రకం: బంకర్ బస్టర్, అంటే భూగర్భంలో ఉన్న గట్టి నిర్మాణాలను ఛేదించే బాంబు.ఉపయోగం: క్షిపణి సైలోలు, కమాండ్ సెంటర్లు, బలమైన రక్షణ గల స్థావరాలను ధ్వంసం చేయడం.వాహక విమానాలు: భారీ బాంబర్లు లేదా ప్రత్యేకంగా సిద్ధం చేసిన యుద్ధ విమానాలు.ట్రంప్ హెచ్చరిక..మరోవైపు..నాటో మద్దతు లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే భద్రతలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్తితుల్లో కూడా ఎక్కువ సమయం పట్టదు అని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని, ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హార్మూజ్ భద్రతపై అమెరికా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు.. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం భద్రతా చర్యలకు కీలకమని తెలిపారు. అమెరికా సైన్యం రంగం ప్రవేశం చేస్తే వియత్నాం తరహా యుద్ధం జరుగుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి చేసిన హెచ్చరికలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, దేనికీ కూడా భయపడేది లేదని స్పష్టం చేశారు -
గుడ్‌న్యూస్.. ఇరాన్ యుద్దంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత వారంలో ఈ వివాదం ముగిసే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలపై ట్రంప్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగింపునకు వస్తుంది. ఇప్పటికే యుద్ధం మూడో వారంలోకి చేరుకుంది. యుద్ధం ముగిసినప్పుడు మనకు చాలా సురక్షితమైన ప్రపంచం ఉంటుంది. తక్షణ ముగింపును నేను ఆశించడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా ఆపడం ప్రపంచ భద్రత కోసం అత్యంత అవసరం. ఇరాన్‌కు అణ్వాయుధాలు లభిస్తే అవి వెంటనే ఉపయోగించే అవకాశం ఉంది. అలా జరిగితే పశ్చిమాసియా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు.ఇదే సమయంలో తాను యుద్ధాలను కోరుకునే వ్యక్తి కాదని, కానీ ప్రపంచ భద్రత కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "నాకు యుద్ధాలు అంటే ఇష్టం లేదు. కానీ బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది" అని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ దాడులు ఆశ్చర్యమే.. అలాగే.. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులు ప్రారంభించిదని చెప్పుకొచ్చారు. అయితే, ఇరాన్ దాడులు తనను ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. నిఘా అధికారులు సైతం అలాంటి దాడులను ఊహించలేదని ట్రంప్ వెల్లడించారు. దాడికి గురైన అనేక దేశాలు ఇరాన్‌తో సాపేక్షంగా తటస్థ సంబంధాలను కొనసాగించాయని తెలిపారు.🚨 JUST IN: President Trump reveals he could end the Iran war within DAYS if he wanted toDOOCY: "If Iran is totally obliterated...can we wrap this war up this week?"TRUMP: "Yeah. Sure. We could."DOOCY: "Will we?"TRUMP: "I don't think so, but it'll be soon!" 👀🔥 pic.twitter.com/GcAoLOIfdC— Eric Daugherty (@EricLDaugh) March 16, 2026మిత్ర దేశాలపై ఆగ్రహం.. మరోవైపు.. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంలో అమెరికాకు సహాయం చేయడానికి ఏయే దేశాలు అంగీకరించాయో త్వరలో ప్రకటించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు రోజువారీ రవాణాకు కారణమయ్యే ఈ జలమార్గం ద్వారా నౌకలకు రక్షణ కల్పించడంలో అనేక మిత్రదేశాలు విముఖత చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మాకు సహాయం చేయడానికి మిత్ర దేశాలు ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు అమెరికా ప్రయత్నాలకు మరింత మద్దతు ఇవ్వాలని వాదించారు.ఇరాన్ ప్రపంచానికే ముప్పు.. అంతకుముందు కూడా ఇరాన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని, ఇజ్రాయెల్ సాయంతో ఆ ముప్పును అంతం చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇరాన్‌లోని ఏడువేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని, అందులో అధిక భాగం వాణిజ్య, సైనిక స్థావరాలేనని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సేనలు క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. సోమవారం కూడా అలాంటి 3 కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పారు. మరోవైపు తమ దాడుల్లో గత వారం వ్యవధిలో వందకు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని, దీనితో ఆ దేశానికి చెందిన నౌకాదళం, వాయుసేన దాదాపు అంతం అయ్యాయని పేర్కొన్నారు. -
ట్రంప్‌నకు భారీ షాక్.. యుద్ధంలో ఊహించని ఎదురుదెబ్బ?
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏడు మిత్రదేశాలు ట్రంప్‌కు షాకిచ్చాయి. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో, ఇరాన్‌తో యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్రదేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో యుద్ధనౌకను పంపాలని కోరుతూ అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేదని మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ వార్‌షిప్‌ను పశ్చిమాసియాకు పంపే ఆలోచనేదీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైందో తమకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జపాన్ ఝలక్..మరోవైపు.. ట్రంప్ సందేశంపై జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా స్పందించారు. జపాన్ పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు.బ్రిటన్ ఇలా.. అలాగే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. బదులుగా, మైన్-హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం. కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నిరాకరిస్తున్నాయి. దీంతో, ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్‌నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.అమెరికా ఒత్తిడి..యుకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. -
దుబాయ్ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం.. విమానాలు బంద్
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మూడు దేశాల మధ్య దాడులు 17వ రోజుకు చేరుకున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకారంగా భీకర దాడులకు పాల్పడుతోంది. తాజాగా దుబాయ్ ఎయిర్‌పోర్టు వద్ద ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో, ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అధికారులు నిలిపివేసినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాల మేరకు.. దుబాయ్‌పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఇంధన ట్యాంక్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ ఘటన జరిగినట్లు సమాచారం. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయ అధికారులు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.The drone crash near Dubai International Airport resulted in damage to one of the fuel tanks, and Dubai Civil Defense teams are currently working to control the fire, with no injuries recorded so far. Dubai Media Officepic.twitter.com/t5zmXfsWUD— Furkan Gözükara (@FurkanGozukara) March 16, 2026కాగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రధాన రవాణా కేంద్రమైన దుబాయ్ విమానాశ్రయాన్ని ఇప్పటికే అనేకసార్లు ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల మార్చి 7న కూడా దాడి జరిగింది. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని ఇరాన్ పిలుపునిచ్చిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వహించే ప్రధాన టెర్మినల్‌కు నిలయమైన ఖార్గ్ ద్వీపంపై ఇటీవల దాడులు చేయడానికి యూఏఈలోని ఓడరేవులు, రహస్య స్థావరాలను అమెరికా ఉపయోగించిందని ఇరాన్ ఆరోపించింది.మరోవైపు.. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేపడతుండగా, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకారదాడులు కొనసాగిస్తోంది.❗️🇮🇷⚔️🇦🇪 - A large fire broke out in the industrial zone adjacent to Dubai International Airport (DXB) following reports of an Iranian Shahed-136 drone—known in Russian service as the Geran-2—striking or being intercepted nearby. Visible flames and smoke prompted authorities to… pic.twitter.com/0u1m4Zgtqo— 🔥🗞The Informant (@theinformant_x) March 16, 2026 Todo el aeropuerto de #Dubai en la planta baja . No se han escuchado explosiones ni nada pero acaban de cerrar todos los pisos superiores incluidas las tiendasNo hay nadie arriba , solo un escuadrón de militares. pic.twitter.com/SJ0lc4FZWw— Don Hulio Mezquitas (@BuscaRaciocinio) March 15, 2026 -
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ షిప్పింగ్‌కు వీలుగా తెరిచే ఉంచుతామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే దాని గుండా అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ‘ఈ మార్గాన్ని ఇతర దేశాల నౌకలకు తెరిచే ఉంచుతాం. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా పలు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లాయి. కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాలతో వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.మరో జలసంధి బంద్..!మరోవైపు.. ఇరాన్ అండదండలున్న యెమన్ హౌతీ మిలిటెంట్లు ఆ దేశానికి మద్దతుగా అతి త్వరలో రణరంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన మార్గమైన బాబ్ ఎల్–మాండెబ్ జలసంధి కూడా మూతపడేలా కనిపిస్తోంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలను మధ్యదరా సముద్రంతో అనుసంధానించే మాండెబ్‌పై హౌతీలకు గట్టి పట్టుంది. ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడానికి దాన్ని మూసేస్తామని హౌతీలు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మాండెబ్ నుంచి కూడా రవాణా ఆగితే సరుకుల ధరలకు రెక్కలు రావడం ఖాయం. భారత్ వైపు చమురు నౌక.. భారత్‌కు చెందిన మరో నౌక ‘జగ్ లాడ్కీ’ భారీ చమురుతో యూఏఈలోని పుజైరా చమురు కేంద్రం నుంచి స్వదేశానికి బయల్దేరింది. పశ్చిమాసియా యుద్ధక్షేత్రం నుంచి క్షేమంగా బయటపడిన నాలుగో భారత నౌకగా నిలిచింది. పుజైరాపై భీకర దాడులు జరుగుతున్నా 80,800 టన్నుల ముడి చమురు నింపుకొని క్షేమంగా వస్తున్నట్లు కేంద్రం అదివారం వెల్లడించింది. -
యుద్దం వేళ భారీ ట్విస్ట్.. ఇరాన్‌కు ఉత్తర కొరియా మద్దతు
ప్యాంగ్యాంగ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై తాజాగా ఉత్తర కొరియా స్పందించింది. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్నికను ఉత్తర కొరియా స్వాగతించింది. అదే సమయంలో పశ్చిమాసియా దేశంపై చట్టవిరుద్ధమైన దాడులకు ఇజ్రాయెల్, బద్ధ శత్రువు అమెరికాను విమర్శించింది.ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఓ ప్రకటనలో.. ఇరానియన్లు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ఉత్తర కొరియా గౌరవిస్తుందని పేర్కొంది. అలాగే, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చట్ట విరుద్ధం. ఇరాన్‌పై వారి సైనిక చర్యలు, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. ఇరాన్ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నం చేయడమేంటి?. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేయడంతో పాటుగా అస్థిరతను పెంచుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా (china) తాజాగా స్పందించింది. మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్లో హత్యకు గురైన తండ్రి అలీ ఖమేనీ వారసుడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవడంపై తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది. మోజ్తాబా ఖమేనీని నియమించాలనే ఇరాన్ నిర్ణయాన్ని వారి అంతర్గత విషయంగా చైనా పేర్కొంది.ఏ సాకుతోనైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత , ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఇజ్రాయెల్ కు హితవు పలికారు. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మోజ్తాబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను చైనా గతంలో చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఖండించింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. -
ఇరాన్‌తో యుద్ధం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే..
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.. -
దోహా, ఖతార్, యూఏఈపై.. ఇరాన్ భీకర దాడులు
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆయన తెలిపారు. అయితే, అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అంతరాయం కలిగిస్తే ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
అమెరికా-ఇజ్రాయిల్‌ల మధ్య భిన్న స్వరం
ఇప్పటివరకూ ఇరాన్‌పై సంయుక్తంగా దాడి చేస్తూ వస్తున్న అమెరికా- ఇజ్రాయెల్‌లు ఓ విషయంలో మాత్రం రెండుగా చీలిపోయాయి. చమురు నిల్వల అంశంలో అమెరికా-ఇజ్రాయెల్ వైఖరి భిన్నంగా ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసిన నేప థ్యంలో ట్రంప్ హుకుం జారీ చేశారు. ఆ చమురు నిల్వలపై దాడి చేయొద్దంటూ ఇజ్రాయిల్‌ను ఆదేశించారు. దీంతో అమెరికా- ఇజ్రాయెల్ మధ్య కాస్త ఏరుపాటు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఒక్కసారిగా ట్రంప్ ఆదేశాలకు నెతాన్యాహూ అలిగారట. -
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్‌కు భారీ షాక్!
మిడిల్ఈస్ట్ వార్‌లో ఇరాన్‌కు సాయం విషయంలో చేదు అనుభవమే ఎదురవుతోంది. చేతులు కలుపుతాయని భావించిన దేశాలతో పాటు పలు గ్రూపులు.. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో పెద్దగా స్పందించడం లేదు. వీటికి తోడు పాలు పోసి పెంచిన పాములు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ చాలా కాలంగా ఇరాక్‌లోని షియా మిలీషియాలను పెంచుతూ వచ్చింది. కానీ, ప్రస్తుతం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఈ గుంపులు పెద్దగా స్పందించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు..ఇరాన్ ‘‘ప్రాక్సీ మిలీషియాలు” అంటే.. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా, ఇతర దేశాల్లోని మిలీషియా గుంపులను ఆయుధాలు, శిక్షణ, డబ్బు ఇచ్చి తన తరఫున పోరాడేలా తయారు చేసిన దళాలు. ఇవి ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్, పాలస్తీనా వంటి ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఉన్నాయి.ప్రాక్సీ మిలీషియాల అర్థం.. ప్రాక్సీ అంటే ప్రత్యామ్నాయం లేదంటే ప్రతినిధి. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి, నేరుగా యుద్ధం చేయకుండా దశాబ్దాలుగా ఈ స్థానిక మిలీషియాలను ఉపయోగిస్తుంది. వీరికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC), క్వుడ్స్ ఫోర్స్ ఆయుధాలు, శిక్షణ, డబ్బు అందిస్తాయి.ఇరాక్‌లోని ప్రధాన ప్రాక్సీ మిలీషియాలుకటాయిబ్ హిజ్బుల్లా (Kataib Hezbollah): ఇరాన్ మద్దతుతో పనిచేసే శక్తివంతమైన షియా మిలీషియా.బద్ర్ ఆర్గనైజేషన్ (Badr Organization): రాజకీయ పార్టీగా కూడా పనిచేస్తుంది. ఇరాక్ పార్లమెంట్లో స్థానాలు కలిగి ఉంది.అసాయిబ్ అహ్ల్ అల్-హక్ (Asaib Ahl al-Haq): ఇరాన్‌తో బలమైన సంబంధాలు కలిగిన మిలీషియా.హరాకత్ హిజ్బుల్లా అల్-నుజబా (Harakat Hezbollah al-Nujaba): ఇరాన్ ద్వారా శిక్షణ పొందిన మరో మిలీషియా.ఇవి ఏం చేస్తాయంటే.. ఇరాన్‌కు మద్దతుగా పలు పోరాటాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. గతంలో మోహరించిన ఇరాక్‌లో అమెరికా సైన్యంపై దాడులు చేశాయి. సిరియా యుద్ధంలో పాల్గొనడంతో పాటు అసాద్ ప్రభుత్వానికి మద్దతుగా పోరాడాయి. ఈ క్రమంలోనే.. ఇరాక్‌లో కొన్ని మిలీషియాలు రాజకీయ పార్టీలుగా రూపాంతరం సంతరించుకున్నాయి.ప్రస్తుత పరిస్థితి..రాయిటర్స్ నివేదిక ప్రకారం, అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఇరాక్‌లోని ఈ మిలీషియాలు పెద్దగా స్పందించడం లేదు. ఇరాన్ ప్రాక్సీలు ఒకప్పుడు అమెరికా దళాలకు పెద్ద సవాలు అయ్యాయి. కానీ ఇప్పుడు, రాజకీయాలు మరియు ఆర్థిక లాభాలపై దృష్టి పెట్టడం వల్ల వారు పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఇది ఇరాన్‌కు ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు. అందుకు కారణాలు పరిశీలిస్తే..ప్రాంతీయ మిత్ర గుంపుల నాశనం: లెబనాన్, సిరియా, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గుంపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.రాజకీయ శక్తి కోసం పోరాటం: ఇరాక్‌లోని మిలీషియాలు ఇప్పుడు రాజకీయ ప్రభావం, అధికారం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నాయి.ఆర్థిక లాభాలపై దృష్టి: డబ్బు సంపాదన వీరి ప్రధాన లక్ష్యంగా మారింది. కాంట్రాక్టులు, వ్యాపారాలు, స్మగ్లింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాయి.చరిత్ర ఇలా.. ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల చరిత్ర 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ తన విప్లవ గార్డ్స్ (IRGC), ప్రత్యేక Qods Force ద్వారా లెబనాన్, ఇరాక్, యెమెన్, సిరియా, గాజా వంటి ప్రాంతాల్లో మిలీషియా గ్రూపులను నిర్మించి, ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందించింది. ఈ గ్రూపుల నాయకత్వం స్థానికంగా ఉన్నప్పటికీ, ఇరాన్‌తో గాఢమైన సంబంధం కలిగి ఉంది.1979 విప్లవం తర్వాత: ఇరాన్ తన విప్లవ సిద్ధాంతాన్ని విస్తరించడానికి ప్రాక్సీ గ్రూపులను నిర్మించడం ప్రారంభించింది.1980లలో: లెబనాన్‌లో హిజ్బుల్లా స్థాపన, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ప్రధాన శక్తిగా ఎదగడం.1990–2000లలో: ఇరాక్‌లో షియా మిలీషియా గ్రూపులు (PMF, కతాయిబ్ హిజ్బుల్లా, ఆసైబ్ అహ్ల్ అల్-హక్) బలపడటం.2010లలో: యెమెన్‌లో హౌతీలకు మద్దతు, సౌదీపై దాడులు, రెడ్ సీ షిప్పింగ్‌కి ముప్పు.ప్రస్తుతం (2026): ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాక్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి, కానీ కొన్ని ఇరాక్ గ్రూపులు యుద్ధంలో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్నాయి.నాయకత్వం..హిజ్బుల్లా (లెబనాన్): హసన్ నస్రల్లా – ఇరాన్‌కి అత్యంత విశ్వసనీయ మిత్రుడు.హమాస్ (గాజా): యహ్యా సిన్వార్, మహ్మద్ దీఫ్ – ఇరాన్ నుండి ఆర్థిక, సైనిక సహాయం పొందుతున్నారు.హౌతీలు (యెమెన్): అబ్దుల్-మాలిక్ అల్-హౌతి – ఇరాన్ డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీతో బలపడిన నాయకుడు.ఇరాక్ మిలీషియా: కతాయిబ్ హిజ్బుల్లా, ఆసైబ్ అహ్ల్ అల్-హక్ వంటి గ్రూపుల నాయకులు IRGCతో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. -
ఇరాన్లో విషపూరిత పొగలు.. హెచ్చరికలు జారీ
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్‌పై దాడుల తీవ్రత పెరిగింది..


