ఆ సొమ్మెక్కడిదో చెప్పాల్సిందే
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకపోతే సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ దర్యాప్తునకు సిద్ధం కావాల్సిందేనని సహారా గ్రూప్‌ను సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించడానికి నిరాకరించిన సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌తో పాటు గ్రూప్‌ను తీవ్రస్థారుులో వుందలించింది. తవు ఉత్తర్వుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకుండా ఉండడానికి తావుు నిస్సహాయుులం కాదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లవద్దంటూ సుబ్రతా రాయ్‌కు జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయుని పేర్కొంది. ‘న్యాయుస్థానం నిస్సహాయుురాలని భావించవద్దు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో మీరు చెప్పకపోతే మేం కనుగొనగలం.
మీపై సీబీఐ, కంపెనీల రిజిస్ట్రార్ల దర్యాప్తునకు మేం ఆదేశించగలం. మీరు సొవుు్మను వాపసు చేశారంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న రికార్డులు మీవద్ద ఉండితీరాలి’ అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సొవుు్మ ఎక్కడినుంచి వచ్చిందన్న విషయుం అసంగతవుని సెబీకి సహారా గ్రూప్ లేఖ రాయుడంపై కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. సుబ్రతా రాయ్‌తో పాటు కంపెనీ వ్యవహారశైలి జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో వేలాది కోట్ల రూపాయులు వుుడిపడి ఉన్నాయుని పేర్కొంటూ, రిజిస్టరైన కంపెనీలు అకౌంట్లను నిర్వహించకుండా ఎలా ఉండగలుగుతున్నాయుని ప్రశ్నించింది. గత రెండేళ్లుగా వాస్తవం చెప్పలేకపోయూరంటూ ఆగ్రహం వెలిబుచ్చింది. మీరు తప్పు చేసి ఉంటే మేమేం చేయులేం... అని కోర్టు స్పష్టం చేసింది.