నగదులో అన్ని కోట్ల లావాదేవీలు ఎలా?
న్యూఢిల్లీ: నగదు రూపంలో అన్ని కోట్ల లావాదేవీలు ఎలా సాధ్యమని సహారా గ్రూప్ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం సందేహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నియమ నిబంధనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని ఆదేశించింది.
నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం... తిరిగి చెల్లించడంపై వైఫల్యం తత్సంబంధ అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం తాజా సూచనలు చేసింది. కేసు విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.