రాష్ట్ర గవర్నర్‌గా రాజగోపాల్?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర గవర్నర్‌గా ఓ. రాజగోపాల్‌ను నియమించవచ్చని తెలిసింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆది లేదా సోమవారం ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. వీరి లో కర్ణాటకకు రాజగోపాల్ నియామకం దాదాపుగా ఖరారైందని తెలి సింది. 84 ఏళ్ల రాజగోపాల్ బీజేపీ కేరళ శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు. వా జ్‌పేయి మంత్రి వర్గంలో రైల్వే, రక్షణ ఉత్పత్తులు, పార్లమెంటరీ వ్యవహా రాలు, న్యాయ శాఖల్లో సహాయ మంత్రిగా పని చేశారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ చేతిలో ఓటమి చెందారు. ఇంతకు మునుపు గవర్నర్‌గా పని చేసిన హెచ్ఆర్. భరద్వాజ్ గత నెల 28న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం 29న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తాత్కాలిక గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు వస్తారనే విషయమై పలువురి పేర్లు షికార్లు చేశాయి. ఢిల్లీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మురళీ మనోహర్ జోషిల పేర్లు వినవచ్చాయి. చివరికి రాజగోపాల్ పేరును ప్రధాని నరేంద్ర మోడీ సిఫార్సు చేశారని సమాచారం.