orders withdraw
-
భారత్ సహా 4 దేశాలపై నిషేధం ఎత్తివేత
మాస్కో: మహమ్మారి కరోనా ప్రవేశంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడం.. వ్యాక్సిన్ కూడా రావడంతో క్రమేణా ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు రాకపోకలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశం షరతులతో రాకపోకలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా ఇప్పుడు పలు దేశాలకు విధించిన రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసింది. భారతదేశంతో పాటు ఫిన్‌ల్యాండ్, వియత్నాం, ఖతార్ దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా నిన్న ప్రకటించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మార్చి 16, 2020లో విధించిన నిషేధం దాదాపు పది నెలల తర్వాత జనవరి 25న ఎత్తివేశారు. దీంతో ఈ దేశాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యాలో 36, 79, 247 కరోనా కేసులు నమోదవగా, 68, 397 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో తాజాగా సోమవారం 19,290 కేసులు నమోదవగా.. 456 మృతులు నమోదయ్యాయి. -
పూర్తి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు వెనక్కి
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ వాణిజ్య సంస్థలు, కంపెనీలు పనిచేయకున్నా సరే, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆదాయం లేని సమయంలో, పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఊరట లభించినట్లయింది. వేతనాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
'వ్యాట్'పై వెనక్కి తగ్గిన టీ సర్కార్
పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచుతూ సోమవారం జారీచేసిన జీవోను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జీవో విడుదలైన కొద్ది సేపటికే దానిని రద్దుచేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం వెలువరించింది. సాంకేతిక సమస్యల వల్లే వ్యాట్ పెంపు నిర్ణయం లీకైందని, గుర్తించిన వెంటనే ఉపసంహరించుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.