ordinance on convicted MPs
-
తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా?
హైదరాబాద్ : జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌నే చించేశారని.... అలాంటిది తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కనీసం నోట్‌ను ఆపలేకపోయారన్నారు. తెలంగాణపై కేబినెట్ సిద్ధం చేయటం అంటే సీమాంధ్ర ప్రజలను అవమాననించినట్లేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. 65 రోజులుగా సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నా.... కేంద్రం పట్టించుకోవటం లేదని ఆమె మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల ఆవేదన కనిపించటం లేదా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చివరి బంది వరకు పోరాడతామన్న ముఖ్యమంత్రి.... ఇప్పుడు తల పగిలేలా ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. కేబినెట్ ఎదుట తెలంగాణ నోట్ పెడితే.....పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. -
ఆ ఆర్డినెన్స్ నాన్సెన్స్ : రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరచరితులను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్...పూర్తి నాన్సెన్స్ అని....దాన్ని చించిపారేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతిని రూపుమాపాలంటే...ఇలాంటి విషయాల్లో రాజీపడటం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ మీట్ ద ప్రెస్‌కు హఠాత్తుగా వచ్చిన రాహుల్ ఆర్డినెన్స్‌పై కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపారు. సొంత పార్టీనే తిట్టిపోశారు. శిక్ష పడిన ఎంపిలు, ఎంఎల్ఎలు తక్షణమే అనర్హతను ఎదుర్కొనకుండా వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. రెండేళ్లు అంతకు మించి శిక్ష పడితే ఎంపి లేదా ఎంఎల్ఎ తక్షణం అనర్హతకు గురవుతారని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.