ఆ ఆర్డినెన్స్ నాన్‌సెన్స్‌ : రాహుల్ | Ordinance to protect convicted netas 'complete nonsense', says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆ ఆర్డినెన్స్ నాన్‌సెన్స్‌ : రాహుల్

Published Fri, Sep 27 2013 2:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆ ఆర్డినెన్స్ నాన్‌సెన్స్‌ : రాహుల్ - Sakshi

ఆ ఆర్డినెన్స్ నాన్‌సెన్స్‌ : రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  నేరచరితులను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌...పూర్తి నాన్‌సెన్స్‌ అని....దాన్ని  చించిపారేయాలని ఆయన వ్యాఖ్యానించారు.  దేశంలో అవినీతిని రూపుమాపాలంటే...ఇలాంటి విషయాల్లో రాజీపడటం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ మీట్‌ ద ప్రెస్‌కు హఠాత్తుగా వచ్చిన రాహుల్‌  ఆర్డినెన్స్‌పై కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడారు. ఆర్డినెన్స్పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపారు. సొంత పార్టీనే తిట్టిపోశారు.

శిక్ష పడిన ఎంపిలు, ఎంఎల్‌ఎలు తక్షణమే అనర్హతను ఎదుర్కొనకుండా వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. రెండేళ్లు అంతకు మించి శిక్ష పడితే ఎంపి లేదా ఎంఎల్‌ఎ తక్షణం అనర్హతకు గురవుతారని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement