Ordinary citizens
-
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
సామాన్యునికి సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
రాజులు రాణులు సామాన్య పౌరులు
ఈ దేశపు రాకుమారుడిని ఆ దేశపు రాకుమారి, ఆ దేశపు రాకుమారుడిని ఈ దేశం రాకుమారిని వివాహమాడడం సాధారణంగా జరిగేదే. అయితే రాజకుటుంబాల వాళ్లు సామాన్య పౌరుల్ని పెళ్లి చేసుకోవడమే విశేషంగా కనిపిస్తుంది. అటువంటి విశేష వివాహబంధాలలో కొన్ని. కేట్ మిడిల్టన్ – ప్రిన్స్ విలియం (ఇంగ్లండ్) కేట్ కామన్ గర్ల్. విలియమ్ ది రాజుల ఫ్యామిలీ. స్కాట్లండ్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు చూపులు కలిశాయి. ప్రేమలేఖలు పూశాయి. పెళ్లితో అవి పరిమళించాయి. 2011లో కేట్ రాజప్రాసాదంలోకి విలియమ్ భార్యగా అడుగుపెట్టింది. గ్రేస్ కెల్లీ – ప్రిన్స్ రైనర్ ఐఐఐ (మొనాకో–యూరప్) గ్రేస్ కెల్లీ హాలీవుడ్ నటి. పుట్టి పెరిగింది ఫిలడెల్ఫియాలో. 1955లో ఆమెకు ‘ది కంట్రీ గర్ల్’ అనే చిత్రానికి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అదే ఏడాది ఆమె అనుకోకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోనాకో రాకుమారుడు రెయినర్ ఐఐఐ ని కలుసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే ఆమె రాకుమారుడిని పెళ్లి చేసుకున్నారు. సినిమాలు మానేశారు. మోనాకో వెళ్లిపోయారు. చనిపోయేవరకు ఆ దేశంలోనే ఉండిపోయారు. లెటీజియా ఆర్టిజ్ రొకాసొలానో – కింగ్ ఫెలిపే vi (స్పెయిన్) ప్రస్తుత స్పెయిన్ రాణి లెటీజియా ఆర్టిజ్ ఒకప్పుడు జర్నలిస్ట్. న్యూస్ బ్రాడ్‌కాస్టర్. 2000 యు.ఎస్.అధ్యక్ష ఎన్నికల కవరేజీతో, ‘టెలీడైరియో’ అనే న్యూస్ప్రోగ్రామ్తో ఆమె పాపులర్ అయ్యారు. అలా అప్పటి ఆస్ట్రూరియస్ (స్పెయిన్‌లో ఒక భాగం) యువరాజు కంట్లో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను చూసి స్పెయిన్ ముక్కుమీద వేలేసుకుంది. అందుకు కారణం లెటీజియా అతి సామాన్యురాలు కావడం ఒక్కటే కాదు, అప్పటికే ఆమెకు ఒకసారి పెళ్లి అయి ఉండడం! రానియా అల్ యస్సీన్ – కింగ్ అబ్దుల్లా ఐఐ ఆఫ్ జోర్డాన్ జోర్డాన్ ప్రస్తుత రాణి రానియా తన 22 ఏళ్ల వయసులో జోర్డాన్ రాకుమారుడు అబ్దుల్లాను కలుసుకున్నారు. రానియా కువైట్‌లోని పాలస్తీనా తల్లిదండ్రులకు పుట్టింది. సద్దాం హుస్సేన్ కువైట్‌ను ఆక్రమించుకుంటున్న సమయంలో వీళ్ల కుటుంబం జోర్డాన్ వెళ్లిపోయింది. జోర్డాన్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో రానియా చదువుకుంది. అక్కడే కొంతకాలం సిటీబ్యాంక్‌లో, ఆపిల్ సంస్థలో పనిచేసింది. 1999లో వీళ్ల పెళ్లి జరిగింది. మాక్సిమా జొర్రెంగీటా సెర్రూటి – కింగ్ విలియమ్ అలెగ్జాండర్ ఆఫ్ నెదర్లాండ్స్ మాక్సిమా జన్మస్థలం అర్జెంటీనా. న్యూయార్క్ లోని డ్యూచే బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఆమె 1999లో ఆమెకు ప్రిన్స్ అలెగ్జాండర్‌తో పరిచయం అయింది. తొలిసారి వీళ్లద్దరూ స్పెయిన్‌లోని ఒక వస్తుప్రదర్శన శాలలో కలుసుకున్నారు. అప్పుడు ప్రిన్స్ అలెగ్జాండర్.. తనను తను అలెగ్జాండర్ అని మాత్రమే తెలియజేసుకున్నాడు. తర్వాత వాళ్ల పెళ్లవడం, మాక్సిమా నెదర్లాండ్స్ క్వీన్ అవడం మామూలే. మేరీ షాంటాల్ మిల్లర్ – పావ్లోస్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ మేరీ గ్రీస్‌లో ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కూతురు. ఆయన పేరు రాబర్ట్ వారెన్ మిల్లర్. డ్యూటీ–ఫ్రీ దుకాణ సముదాయాలతో ఒక మహా సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. ఆయన ద్వారా ఏర్పడిన రాజకుటుంబ సాన్నిహిత్యం మేరీకి, పావ్లోస్కి పెళ్లి కుదిర్చింది. 1995లో ఈ వీళ్ల పెళ్లి జరిగింది. ఇప్పుడామె గ్రీసుకు కాబోయే మహారాణి.