సేంద్రియ విజయం
కెరమెరి : సేంద్రియ ఎరువులతో సుస్థిర సాగుపై రైతులు దృష్టి సారించారు. ఒక్కరితో మొదలైన సేంద్రియ వ్యవసాయ వి ధానాన్ని నేడు 2,467 మంది రైతులు అనుసరిస్తున్నారు. వీరి కి చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ చేయూతనందిస్తోం ది. మొదటిసారిగా మండలంలోని చౌపన్గూడ గ్రామానికి చెందిన ఆత్రం కుసుంభరావు 2004లో పత్తి సాగు చేశాడు.
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడంతో ఇతర మండలాలకు రైతులకు అవగాహన కల్పించారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గతంలో ఐటీడీఏ, ఐకేపీలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా స్వతంత్రంగా పనిచేస్తోంది. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(యు), జైనూర్, నార్నూర్, ఉట్నూర్ మండలాల్లోని 148 గ్రామాల్లో సేంద్రియ ఎరువులతో పం టలు సాగవుతున్నాయి.
ఆయా మండలాల్లోని 13,775 ఎకరాల్లో 2,467 మంది రైతులు పత్తి, ఇతర పం టలు సాగు చేస్తున్నారు. వీరంతా 154 గ్రూపులుగా ఏర్పడ్డారు. నాన్బీటీ విత్తనాలతోనే పత్తి పంటలు పండిస్తున్నారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. పత్తి ధర అధికంగా, ఖర్చులు తక్కువ కావడం, వర్షాపాతం తక్కువగా ఉన్నా పంటలు పండే అవకాశం ఉంది.