Oscar fernandez
-
యూపీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో శనివారం ఆయన గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఫెర్నాండెజ్ విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అధికార పార్టీ అక్రమాలే కారణమన్నారు. ఏ గుర్తుకు ఓటేసినా, ఎన్నిసార్లు ఈవీఎం బటన్‌ను నొక్కినా ఓట్లు బీజేపీ గుర్తుమీదనే పడుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంలను పెద్దఎత్తున ట్యాంపరింగ్ చేసి, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. దేశమంతటా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, గుజరాత్‌లోనూ రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆస్కార్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ ఎన్నికకు మూడు సెట్ల నామినేషన్లు ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ నెల 4న టీపీసీసీ నుంచి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రం నుంచి 30 మంది ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. కాగా, 29 రాష్ట్రాల్లో ఉన్న పీసీసీలు మొత్తం రాహుల్ గాంధీ పేరును ఏకగ్రీవంగా బలపరిచాయన్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనప్రాయమేనన్నారు. -
‘నాలుగులైన్లు’.. కలేనా ?
జడ్చర్ల : నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే జడ్చర్ల- నల్గొండ అంతర్రాష్ట్ర రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రతిపాదనలకే పరిమితమై నాలుగు లైన్ల పనులు ముందుకుసాగడం లేదు. గతేడాది రాష్ట్రంలో ఐదు రహదారులకు జాతీయహోదాకల్పించాలని పభుత్వం భావించిన నేపథ్యంలో ఈ రహదారిని కూడా జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన సమీక్ష సమావేశంలో అప్పటి కేంద్రమంత్రి ఆస్కార్ ఫెర్నాండేజ్ ఆమోదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు రహదారలకు జాతీయ రహదారుల స్థాయి కల్పించడానికి నిధులు విడుదల చేసేందుకు ఆమోదంకూడా తెలిపారు. దీంతో కోదాడ- మిర్యాలగూడ- దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర అంతర్రాష్ట్రరహదారిని నాలుగులైన్లుగా మారనున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహ బూబ్‌నగర్ న ల్గొండ మధ్య 163 కి.మీల రహదారిని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాముందుకు సాగలేదు. ముసాయిదా బిల్లులోనూ... తెలంగాణకు రహదారుల సౌకర్యాన్ని మెరుగపర్చాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోను ప్రస్తావించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాలకు అనువుగా తీర్చిదిద్దే బాధ్యతను నేషనల్ హేవేస్ అథారిటీ ఆఫ ఇండియాకి అప్పగించే విధంగా చర్యలు తీసుకొనున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కోదాడ నుండి మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు సుమారు 220 కి.మీల మేర రోడ్డును జాతీయరహదారి స్థాయికి పెంచాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విస్తరిస్తే ప్రయోజనమిదే.. అయితే ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తే కర్ణాటక ప్రాంతవాసులు కోస్తా జిల్లాలకు వెళ్లేందుకు దాదాపుగా వంద కిమీలకు పైగా దూరం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి, దేవరకొండ మీదుగా నల్గొండ జిల్లాలోని మాచర్ల వద్ద జాతీయ రహదారిని చేరుకునే అవకాశం ఉంది. కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల నుండి ఉత్తర భారతం వైపునకు దారిగుండా వెళ్తారు. ముఖ్యంగా జిల్లా రైతులు, వ్యాపారులు ఈ రోడ్డుమార్గం ద్వారా మిర్చి, పత్తి వంటి పంట ఉత్పత్తులను గుంటూరు తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొంత మేర సింగల్, మరికొంత మేర డబుల్ రోడ్డుగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రహదారి ఇరుకుగా ఉండడటంతో ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని పలువురు కోరుతున్నారు. -
పీఎఫ్‌పై వడ్డీ 8.75%
కేంద్రానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ప్రతిపాదన ఆర్థికశాఖ ఆమోదం అనంతరం అమలు మూల వేతనం నుంచి మరో 10% సేకరించి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై పరిశీలన న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలకు చెల్లించే వడ్డీని స్వల్పంగా పెంచుతూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ 8.5 శాతంగా ఉండగా.. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.75 శాతంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో సీబీటీ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్‌పై వడ్డీ పెంపు నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుందని కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే పెంపు అమలవుతుందని కేంద్ర భవిష్యనిధి కమిషన్ చైర్మన్ కేకే జలాన్ చెప్పారు. ఈ ఏడాది మొత్తం పీఎఫ్ సొమ్ముపై సుమారు రూ. 25,048 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని.. అందులో 8.75% వడ్డీకి రూ. 25,005 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మిగతా సొమ్ము నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తక్కువ ఆదాయం వస్తున్న మార్గాల నుంచి మరింత మెరుగైన పథకాల్లోకి పీఎఫ్ నిధులను మళ్లిస్తామని జలాన్ చెప్పారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్నదానికి అదనంగా మరో 10 శాతం తీసుకుని, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద అందజేసే సొమ్మును 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇక నుంచి బీమా కింద రూ. 1,56,000 ఇస్తారు. దాంతోపాటు ఈపీఎఫ్, ఈడీఎల్ఐ పథకాల నిర్వహణ కోసం వసూలు చేసే కనీస చార్జీలను రూ. 500, రూ. 200కు పెంచారు.