ఏప్రిల్ 9న ఓయూసెట్-2015 ప్రకటన
హైదరాబాద్: ఓయూసెట్-2015 ప్రకటన ఏప్రిల్ 9న విడుదల చేయనునట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ. గోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపస్‌లోని అతిథిగృహంలో రిజిస్ట్రార్ ప్రొ. సురేష్‌కుమార్ అధ్యక్షతన ఓయూసెట్ సలహామండలి సమావేశం జరిగింది. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఓయూతోపాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులతోపాటు పీజీ డిప్లొమా, ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి సెట్ నిర్వహించనునట్లు పేర్కొన్నారు. ఓయూసెట్-2015కు మే 11 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.