పాలనలో ప్రజల భాగస్వామ్యం
నిజామాబాద్ రూరల్ : పాలనలో ప్రజలను భాగస్వాములను చేసి అభివృద్ధికి బాటలు వేయడానికి సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ మండలంలోని న్యాల్కల్లో జరిగిన మన ప్రణాళి క గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ప్రణాళికల ఆధారంగానే నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలి పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నె రవేర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగు లు వేస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇళ్ల స్థలా లు ఇప్పించేందుకు తొలుత న్యాల్కల్ గ్రా మాన్నే ఎంపిక చేసుకున్నానని, నిరుపేదల కు ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామ ని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. నిజామాబాద్ మండలంలో రూ. 33 కోట్ల విలువ చేసే 198 పనులను గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. న్యాల్కల్ గ్రామంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు తనవంతు కృషిచేస్తామన్నారు.
పన్నులు చెల్లిస్తేనే ప్రగతి సాధ్యం : జడ్పీ సీఈవో
ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పుడే ప్రగతి పనులు సాధ్యమవుతాయని గ్రామసభలో పాల్గొన్న జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం అన్నారు.ప్రతి గ్రామంలో ప్రజలు 100 శాతం ఇంటిపన్నులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ‘మన ఊరూ-మన ప్రణాళిక’లను ప్రభుత్వానికి పంపుతామని సీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంజీవ్‌కుమార్, గ్రామ సర్పంచ్ సువర్ణ ఉమాపతి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, సాగర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముష్కె సంతోష్, భీంగల్ మాజీ మండల అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కూర గ ంగాదర్, సొసైటీ చైర్మన్ గంగాప్రసాద్, మోపాల ఎంపీటీసీ దండు నర్సయ్య, పాఠశాల హెచ్ఎం కొండ ఆశన్న, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, బోర్గం ఎర్రన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.