‘క్రీడా పాలసీని అమలు చేయాలి’
జింఖానా, న్యూస్‌లైన్: దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచే ప్రభుత్వం క్రీడా పాలసీని అమలు చేయాలని ‘మన పాఠశాలలు, క్రీడా సంస్కృతి’ అనే అంశంపై జరిగిన సెమినార్లో పలువురు ప్రముఖులు సూచించారు. అలాగే క్రీడలను కూడా పాఠ్యాంశంగా చేర్చాలని తెలిపారు. దీంతో పిల్లలు బాల్యం నుంచే క్రీడా సంస్కృతిని అలవరచుకుంటారని చెప్పారు.
వివిధ సంస్థల్లో రెండు శాతం ఉద్యోగ నియామకాలను స్పోర్ట్స్ కోటా కింద అమలు చేయాలని వారు సూచించారు. దీని ద్వారా యువత క్రీడల వైపు ఆకర్శితులవుతుందని చెప్పారు. ఈ సెమినార్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పి.ఎన్ రావు ఐఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ క్రీడల మాజీ సలహాదారుదు డాక్టర్ చిన్నప్ప రెడ్డి, స్పోర్ట్స్ కోచింగ్ అసోసియేషన్ కార్యదర్శి, రంజీ మాజీ క్రికె టర్ కె. సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.