ఫోన్ లేక.. నేను లేను..
నోమో ఫోబియా.. ప్రస్తుతం విదేశాల్లో మాంచి రైజింగ్‌లో ఉన్న ఈ ఫోబియా.. మన దగ్గరా చాలా మందికి ఉండే అవకాశముంది. అందుకే దాని లక్షణాలేమిటో ఓసారి చదివేయండి.
ఫోన్‌ను విడిచి ఉండలేకపోవడం.. మన మొబైల్ ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళన చెందడం.. కనెక్షన్ కట్ అవుతుందని బాధపడటం.. పలుమార్లు ఫోన్ చూసుకోవడం.. బ్యాటరీ డెడ్ అయిపోతుంటే విపరీతంగా టెన్షన్ పడటం.. ఫోన్ ఉంటే చాలు.. మిగతావారు పట్టనట్టు ఉండటం.. ఈ నోమో ఫోబియాకు సంబంధించి అమెరికాలో పలు ప్రముఖ సంస్థలు సర్వేలు కూడా నిర్వహించాయి. వాటి ప్రకారం ఈ ఫోబియా రోజురోజుకూ పెరుగుతోందట. ఆ వివరాలు ఇవీ..