out nurseing
-
మెరుగైన సేవలందిస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని.. రోగులకు ఎలాంటి ఇబ్బందీ కలగనివ్వమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య చెప్పారు. మంగళవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించి బాదేపల్లి, బిజినేపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ ఉన్న వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిద్య, అనాగరికత, వలసలు, మూఢనమ్మకాల మూలంగానే జిల్లా లో మాతా శిశు మరణాలు, హెచ్ఐవీ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. పాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి బాదేపల్లి సీహెచ్‌సీని సందర్శించారు. అక్క డ ఔట్‌పేషెంట్ విభాగం నిర్వహణ తీరును పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన మిహ ళలతో మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా సరఫరా చేస్తు న్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఎక్స్‌రే యంత్రాన్ని పరిశీలించి, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టెక్నీషియన్‌ను నియమించుకోవాలని ఆదేశించారు. రోగులకు భోజనం, మందులు అందుతున్నాయా లేదా అని ఆరా తీసిన డిప్యూటీ సీఎంకు పలు పిర్యాదులు అందాయి. ఆసుపత్రి అభివృద్ధి నిధు ల్లో 10శాతం మందుల కొనుగోలుకు వినియోగించుకునే అవకాశముందన్నారు. బయటి షాపుల నుంచి మందులు సిఫారసు చేసే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిజినేపల్లి ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గదిని పరిశీలించి ఆపరేషన్ చేయించుకున్న మహిళలతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యసేవలు అందించేందుకు 104 ద్వారా మారుమూల ఆరోగ్య ఉపకేంద్రాల్లో కూడా మెరుగైన సేవలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గుమ్మకొండ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామసభకు డిప్యూటీ సీఎం రాజయ్య హాజరయ్యారు. రాష్ట్ర జనాభా 3.60 కోట్లు కాగా, 84లక్షల కుటుంబాలకు 1.10లక్షల రేషన్ కార్డులు జారీ అయ్యాయన్నారు. లబ్ధిదారుల కంటే నిర్మితమైన గృహాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పన లక్ష్యంగా ‘మన ఊరు- మన ప్రణాళిక’ చేపట్టామన్నారు. రాష్ట్రంలో 85శాతం మేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. అనంతరం నాగర్‌కర్నూలు ఏరియా ఆసుపత్రిని డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇన్‌పేషెంట్లు, ఔట్‌పేషెంట్లకు తగినట్లుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, ప్ర యోగశాల లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ నే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. వైద్యులకు రక్షణ, ఖాళీగా వున్న పోస్టుల భర్తీ, చికిత్సకు అవసరమైన పరికరాలు సమకూర్చడం వంటి హామీలు ఇచ్చారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. చివరగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని తనిఖీ చేశారు. భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం వెంట కలెక్టర్ గిరిజా శంకర్, డీఎంహెచ్ఓతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పీఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలి
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: మున్సిపల్ కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము జమచేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మనెంట్ చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అవుట రవీందర్, అద్దంకి నర్సింహ, పెరిక భిక్షం, పేర్ల సంజీవ, దాసరి లక్ష్మ మ్మ, సుగుణమ్మ, భాగ్యమ్మ, ఎల్లమ్మ, నాగుల కరుణ, ఈశ్వరమ్మ, రమేష్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ధ్వంసం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడుతూ పలువురు సమైక్యవాదులు మంగళవారం స్థానిక ఉద్యానశాఖ ఏడీ-1 కార్యాలయంలో కంప్యూటర్ను ధ్వంసం చేశారు. కార్యాలయాలు వెంటనే మూసివేయాలని ఉద్యాన శాఖతో పాటు ఏపీఎంఐపీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏడీ-1 కార్యాలయంలో సమైక్యవాదులు, సిబ్బంది మధ్య వాదోపవాదాలు శ్రుతి మించడంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒక కంప్యూటర్ను పగులగొట్టారు. దీంతో వెంటనే కార్యాలయాలకు తాళాలు వేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో లేకున్నా ఉద్యమ తీవ్రత నేపథ్యంలో విధులకు హాజరుకావడం లేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. అయితే... అత్యవసర పనుల నిమిత్తం ఒకరిద్దరు కొంతసేపు ఉండి వెళుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సమైక్యవాదులు, అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో కూడా ఒకరిద్దరు పనిచేస్తుండగా సమైక్యవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి గొడవపడిన విషయం తెలిసిందే. -
మసిపూసి...మారేడు కాయ
సాక్షి, నల్లగొండ : కేజీబీవీల్లో అక్రమ నియామకాలు... బాలికల పట్ల వేధింపులకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ఆర్వీఎం పీఓ బాబు భూక్యా పొంతనలేని వివరణ ఇచ్చారు. ‘కేజీబీవీల్లో వెలుగుచూడని ఉదంతాలెన్నో?’ శీర్షికన ఈ నెల 11వ తేదీన సాక్షి ప్రచురించిన కథనంలో విద్యార్థుల సంఖ్య మినహా, మిగిలిన సమాచారమంతా అక్షర సత్యాలే. ఇదే వివరణ ప్రతులనూ ఆయన కలెక్టర్‌కూ పంపారు. పీఓ వివరణను ఓసారి పరిశీలిస్తే..... పీఓ : బడిబయటి బాలికలను కేజీబీవీలో చేర్పించడంలో కృషి చేసినందుకుగాను.. గతంలో అర్వపల్లిలో పనిచేసిన ఎస్ఓ (ప్రత్యేకాధికారి) ఓ అకౌంటెంట్ని నియమించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. ఇందులో జిల్లా అధికారులకు ఎలాంటి ప్రమేయం లేదు. సాక్షి : ప్రత్యేక అధికారికి ఓ వ్యక్తిని స్వతంత్రంగా విధుల్లోకి తీసుకునే అధికారం ఉందా? ఇలా నిబంధనలు ఉన్నాయా? ఉన్నతాధికారులకు చెప్పకుండా ఇటువంటి నిర్ణయం తీసుకునే ధైర్యం ఆయన చేశారా? ఇలా ఇంకెంతమందిని తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన పోస్టింగ్ ఇచ్చారు? ఇది తెలిసి ఉన్నతాధికారులు ఏం జేశారు? పోని తెలియదనుకుంటే... మరి 2008 డిసెంబర్ నుంచి సదరు అకౌంటెంట్‌కు వేతనం ఎలా చెల్లిస్తూ వస్తున్నారు?.. ఒకవేళ అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నా రిక్రూట్మెంట్ కమిటీ కన్వీనర్, మెంబర్ హోదాలో సపోర్టింగ్ ఆర్డర్ ఇచ్చేది కూడా పీఓనే కదా!. అంతేగాక అభ్యర్థుల నియామకం కోసం ఏజె న్సీకి బాధ్యత అప్పగించేది కూడా ఆయనే. పీఓ : ‘ఓ కేజీబీవీలో ఓ ఉన్నతాధికారి బంధువే అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్థానికేతరుడు. వరంగల్ జిల్లాకు చెందినవాడు’ అని సాక్షి పేర్కొంది. ‘అవాస్తవం. ఎవరికి ఎవరు రక్త సంబంధీకులు కారు.. అని పీఓ వివరణ.సాక్షి : అకౌంటెంట్, సోషల్ సీఆర్టీ భార్యాభర్త. వీరిద్దరూ ఓ ఉన్నతాధికారికి బంధువులు. స్థానికేతరులు. వీరు స్థానికులు కాదనడానికి ‘సాక్షి’ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. పీఓ : బాలికల విద్యాలయంలో పురుష అభ్యర్థులు ఉండవద్దని అవుట్ సోర్సింగ్ అకౌంటెంట్లను ఈఏడాది జూలైలో తొలగించాం. వారు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. అయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నాం. గత ఆగస్టు నెల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. సాక్షి : వాస్తవంగా పురుష అకౌంటెంట్లను తొలగించాలని 2012లోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో అకౌంటెంట్లను అప్పుడే తొలగించాల్సి ఉంది. కానీ ఆర్వీఎం అధికారులు దీన్ని పెడచెవిన పెట్టారు. తిరిగి ఈ ఏడాది జూన్ 20వ తేదీన ఎస్పీడీ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. కచ్చితంగా వారిని తొలగించాలని దీని సారాంశం. అప్పుడు మేల్కొన్న అధికారులు తప్పించే యత్నం చేశారు. ఈ క్రమంలో వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయినా తొలగిస్తున్నామని పీఓ చెబుతున్నారు.. కానీ రెండు రోజులుగా అకౌంటెంట్లు విధులకు హాజరుకావడం గమనార్హం. అయితే ఇంతవరకు వారికి వేతనాలు నిలిపివేసిన దాఖలాలు లేవు. బడ్జెట్ రాకపోవడంతో కేజీబీవీ సిబ్బందికి మొత్తం వేతనాలు అందలేదు. పీఓ : కేజీబీవీల్లో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు ఏ పాఠశాలలో చోటుచేసుకోవడం లేదు. అర్వపల్లి ఘటనపై విచారణ చేశాం. ఆ వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటనను అన్ని పాఠశాలలకు ఆపాదించడం సరికాదు. సాక్షి : తుంగతుర్తి ఘటన అధికారులకు తెలియనట్లుంది. గతంలో అక్కడ బాలికల పట్ల అకౌంటెంట్ ప్రవర్తన సక్రమంగా లేకుంటేనే విధుల నుంచి తొలగించారు. తాజాగా అర్వపల్లిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కింది కాబట్టి.. చర్యలు తీసుకున్నారు. పీఓ : మఠంపల్లి కేజీబీవీ ఆర్వీఎం పరిధిలో లేదు సాక్షి : తన పరిధిలో ఏ మండలాల్లో కేజీబీవీలు ఉన్నాయో ఆర్వీఎం అధికారులకు తెలియకపోవడం గమనార్హం. పీఓ తన వివరణలో చెప్పినట్లు.. మఠంపల్లి కేజీబీవీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పరిధిలో లేదు. ఆర్వీఎం పరిధికి సంబంధించినదే. పీఓ : ‘సదరు అకౌంటెంట్ భార్య అదే కేజీబీవీలో గతేడాది గెస్ట్ టీచర్‌గా పనిచేసింది. ఈ ఏడాది ఆమెను అక్కడే సీఆర్టీగా నియమించారు. అది కూడా నోటిఫికేషన్ సమయంలో అక్కడ ఖాళీ పోస్టు చూపించకుండా’ అని కథనంలో సాక్షి పేర్కొనగా.. అవాస్తవం అని పీఓ వివరణ ఇచ్చారు. సాక్షి : కేజీబీవీలో నోటిఫికేషన్ ద్వారానే సోషల్ సీఆర్టీని నియమించినట్లు ఎటువంటి ఆధారమూ చూపించలేకపోయారు. అంతేగాక మాజీసైనికుల కోటా కింద ఆమెను సీఆర్టీగా నియమించడం గమనార్హం. ఈ మేరకు ఆర్వీఎం పీఓ నుంచి ధ్రువపత్రం కూడా జారీకావడం విశేషం. అందులో స్థానికురాలుగా పేర్కొన్నారు. వాస్తవంగా వరంగల్ జిల్లాకు చె ందిన ఆమెది వ్యవసాయ కుటుంబం. 2012-13 ఏడాదిలో సీఆర్టీగా అపాయింట్మెంట్ ఇవ్వగా.... సదరు వ్యక్తి తిరుమలగిరి కేజీబీవీలో ఈ ఏడాది 13 ఏప్రిల్‌లో విధుల్లో చేరారు. మరోపక్క 2012-13లో సీఆర్టీగా పనిచేశానని, తిరిగి ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఇంకోసారి సీఆర్టీగా సెలక్టయ్యాను, విధుల్లో చేర్చుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన వేర్వేరు లేఖలు రాసి సదరు కేజీబీవీ ఎస్ఓకి ఇచ్చారు. అంతేగాక విధుల్లో చేరిన తే దీని హాజరు రిజిస్టర్లోనూ దిద్దారు. ఇలా పొంతన లేని లేఖలు రాయడం, తేదీ మార్చడం అక్రమ నియామకాలేనని స్పష్టం చేస్తోంది.