అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడుతూ పలువురు సమైక్యవాదులు మంగళవారం స్థానిక ఉద్యానశాఖ ఏడీ-1 కార్యాలయంలో కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయాలు వెంటనే మూసివేయాలని ఉద్యాన శాఖతో పాటు ఏపీఎంఐపీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏడీ-1 కార్యాలయంలో సమైక్యవాదులు, సిబ్బంది మధ్య వాదోపవాదాలు శ్రుతి మించడంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒక కంప్యూటర్‌ను పగులగొట్టారు. దీంతో వెంటనే కార్యాలయాలకు తాళాలు వేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో లేకున్నా ఉద్యమ తీవ్రత నేపథ్యంలో విధులకు హాజరుకావడం లేదని ఆ శాఖ అధికారులు తెలిపారు.
అయితే... అత్యవసర పనుల నిమిత్తం ఒకరిద్దరు కొంతసేపు ఉండి వెళుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సమైక్యవాదులు, అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో కూడా ఒకరిద్దరు పనిచేస్తుండగా సమైక్యవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి గొడవపడిన విషయం తెలిసిందే.
ఉద్యాన శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ధ్వంసం
Published Wed, Oct 2 2013 3:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
Advertisement
Advertisement