కాలం చెల్లిన మందులు
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నారు. పట్టణానికి చెందిన సుధాకర్ గాయపడి ఇటీవలె ఏరియా ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు రాశారు. ఆస్పత్రి మందుల కౌంట ర్లో ప్రిస్కిప్షన్ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాల మందులు నాణ్యతగా ఉన్నాయి. కాగా విటమిన్ మాత్రలు కాలం చెల్లిపోయాయి. కవర్ తొలగించగానే మాత్ర పొడిగా మారింది.
దుర్వాసన గుప్పుమంది. సర్కారు దవాఖానాలోనే ఇలాంటి మాత్రలు ఇస్తే ఎలాగని బాధితుడు వాపోతున్నాడు. ఎప్పటికప్పుడు మందులను, టానిక్‌లు, ఇంజక్షన్లను తనిఖీ చేసి కాలం చెల్లిన వాటిని పక్కకు పెట్టాల్సిన ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది రోగి సరిగా చూసుకోకుండా స్వీకరిస్తే అనారోగ్యం పాలు కావచ్చు, ఒక్కోసారి హరీ మనవచ్చు. అధికారు లు సిబ్బంది మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాల ని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం వివరణ కోరగా మందుల కౌంటర్లో తనిఖీలు నిర్వహిస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.