overtakes
-
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్
యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 'మైక్రోసాఫ్ట్' (Microsoft) మరో సారి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 ప్రారంభం నుంచి మార్కెట్లో యాపిల్ డిమాండ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ యాపిల్ని బీట్ చేసి ఆ స్థానం కైవసం చేసుకుంది. వాషింగ్టన్కు చెందిన మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5% పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏఐ మైక్రోసాఫ్ట్ వృద్ధికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2021 తర్వాత మొదటి సారి యాపిల్ వాల్యుమేషన్ మైక్రోసాఫ్ట్ కంటే తక్కువకు పడిపోయింది. కరోనా మహమ్మారి సమయంలో సప్లై చైన్ కొంత నిరాశపరచిన సమయంలో కూడా యాపిల్ని మైక్రోసాఫ్ట్ అధిగమించింది. ప్రస్తుతం, వాల్ స్ట్రీట్ మైక్రోసాఫ్ట్ మరింత సానుకూలంగా ఉంది. ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న కారణంగా యాపిల్ బలహీనపడింది. ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. చైనాలో యాపిల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది, రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ వృద్ధి గతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడమని తెలుస్తోంది. -
ఓవర్టేక్ చేసి.. టీవీ నటితో అసభ్య ప్రవర్తన
న్యూఢిల్లీ: మద్యంమత్తులో యువకులు ఓ టీవీ నటిపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధింపులకు గురి చేశారు. ఆమెను వెంబడించి భయాందోళనకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. టీవీ నటి ప్రాచీ తెహ్లాన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. మంగళవారం అర్ధరాత్రి భర్తతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో నలుగురు వ్యక్తులు కారును వెంబడించారు. మధువన్ చౌక్‌కు చేరుకోగానే ఆ దుండగులు కారును దాటి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలబెట్టారని ప్రాచీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో దుండుగులను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లామని ఆమె తెలిపారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు దిగారని, తమ కాలనీ గేటు వరకూ తమను ఫాలో అయ్యారని చెప్పారు. ప్రశాంత్ విహార్‌లోని తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్యంగా దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడ్డారని ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు స్పందించి ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మద్యంమత్తులో వారు ఆ విధంగా చేశారని తెలుస్తోంది. కాగా ప్రాచీ తెహ్లాన్ భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. గతంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 2010లో కామన్వెల్త్ క్రీడా పోటీలకు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం 2016లో టీవీ నటిగా మారింది. ‘దియా ఔర్ బాతీ హమ్’ అనే టీవీ షోతో గుర్తింపు పొందింది. 2017లో పంజాబీ సినిమా ‘అర్జన్’లో ప్రాచీ నటించింది. -
చైనాను బీట్ చేసి మరీ నెం.1గా భారత్
టూ వీలర్ మార్కెట్లో భారత్ చైనాను బీట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ వ్యవస్థగా నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి చైనా విక్రయించిన 16.8 మిలియన్ యూనిట్లతో పోలిస్తే, 2016 నాటికి 17.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ విషయంలో చైనాను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి. డీమానిటైజేషన్, బీఎస్ -3 వాహనాల నిషేధం, బీఎస్ -4 నిబంధనల ప్రభావం ఉన్నప్పటికీ భారత్ మార్కెట్ నెంబర్ 1గా స్థానాన్ని నిలిచిందని సియామ్ వెల్లడించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (ఎస్ఐఎఎమ్) అందించిన నివేదిక ప్రకారం ఇప్పటివరకూ ద్విచక్ర వాహన మార్కెట్ లో నెం. 1స్థానంలో ఉన్న చైనాను వెనక్కినెట్టిన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్‌గా అవతరించింది. గత నాలుగేళ్లుగా ఈ సెగ్మెంట్లో భారీ డిమాండ్ నెలకొందని తెలిపింది. 2011-12 లో 13 మిలియన్ల వాహనాలను అమ్ముడు బోతే 2016-15లొ 16మిలియన్లకు, 2016-17 నాటికి 17 మిలియన్లకు డిమాండ్ పెరిగిందని రిపోర్ట్ చేసింది. మార్చి 30, 31, 2017 లో ద్విచక్ర పరిశ్రమ రూ. 600 కోట్ల రూపాయలని అంచనా వేశామని ఇక్రా సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రే తన నివేదికలో తెలిపారు. చైనా మార్కెట్లో గత కొన్నాళ్లుగా వివిధకారణాల రీత్యా టూ వీలర్స్ డిమాండ్ క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా దేశంలో కార్ల డిమాండ్ పెరగడం, ద్విచక్ర వాహనాలపై అధిక దిగుమతుల ఖర్చు పెరగడం ద్విచక్ర వాహన తయారీదారులకి కష్టంగా మారింది. దీంతో చైనా ఈ సెగ్మెంట్లో రెండవ స్థానానికి పడిపోయింది. కాగా ఏప్రిల్ అమ్మకాల్లో హీరో ను వెనక్కి నెట్టిన బజాజ్ ఆటో రెండవ అతిపెద్ద బైక్స్-మేకర్ గా నిలిచింది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా హీరోనిఅధిగమించే దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది 1,50,711 యూనిట్లతో పోలిస్తే, ఈ నెలలోనే 22 శాతం వృద్ధితో 1,83,266 యూనిట్లను విక్రయించినట్లు బజాజ్ ప్రతినిధి గులెరియా తెలిపారు. మొత్తం వాల్యూమ్స్ లో 34 శాతం వృద్ధితో మార్కెట్ లో రెండవ స్థానంలో నిలిచామన్నారు. ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 19 శాతం పెరిగి 1,61,930 యూనిట్లు విక్రయించాయి. జపాన్ ద్విచక్ర వాహన కంపెనీ 21,336 యూనిట్లు విక్రయించగా, మార్కెట్ లీడర్ హీరో మోటో కార్ప్‌తో 12,377 యూనిట్లు మాత్రమే. అలాగే మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి రూ. 1,888 కోట్ల ఆదాయంతో రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించింది. -
ఆదేశం.. భారత్ ను మించిపోయింది!
న్యూఢిల్లీః ప్రతివిషయంలో భారత్ తో పోల్చుకొని, అన్నింటా తానే ముందుండాలని ప్రయత్నించే పాకిస్తాన్.. నల్లడబ్బు విషయంలో ఇండియాను మించిపోయిందట. స్విస్ బ్యాంకుల్లో పదివేల కోట్ల వరకూ ఆదేశం నల్లధనం దాచినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నల్లధనం దాచడంలో ముందు స్థానంలో ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 లెక్కలతో పోలిస్తే పాకిస్తాన్ స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ 16 శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికల్లో వెల్లడించింది. పాకిస్తాన్ నల్లధనం విలువ పెరగడం వరుసగా ఇది రెండోసారని నివేదికలో తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ ఎన్ బి) వెల్లడించిన వివరాలను బట్టి, 2014 లో పాకిస్తాన్ కరెన్సీ సీహెచ్ఎఫ్ 1,301 మిలియన్లుగా ఉన్న నల్లధనం, 2015 పూర్తయ్యేనాటికి 16 శాతం పెరిగి సిహెచ్ ఎఫ్ 1,513 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అయితే భారత్ విషయంలో ఆ విలువలు 33 శాతం పడిపోయి, 2015 చివరికి రూ. 8,392 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎస్ ఎన్ బి వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.