Owaisi Hospital
-
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత -
నిర్లక్ష్యం వద్దు.. తగిన చికిత్స లేకుంటే దుష్పరిణామాలు
కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత ప్రభావాలు, పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. దీనితో ముడిపడిన అనారోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. కరోనా రోగులు ఏ స్థాయిలో దాని బారిన పడ్డారన్న దానిపై వారు పూర్తిగా కోలుకునే కాలం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు, పరిశోధకులు ఇదివరకే తేల్చారు. స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ, వెంటిలేటర్‌పైకి వెళ్లడం, స్టెరాయిడ్స్ స్థాయిల వినియోగం వంటి వాటిని బట్టి కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నెల నుంచి ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. కీళ్లు, కండరాలు, నరాల వ్యవస్థలపై కోవిడ్ అనంతరం ప్రభావాలు తీవ్రంగా ఉన్నట్టు ఇప్పటికే తేలింది. తాజాగా కోవిడ్ రోగులు ఎముకల్లో పటుత్వాన్ని కోల్పోతున్నారని (బోన్ డెత్– అవాసు్క్యలర్ నెక్రోసిస్ (ఏవీఎన్)) హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రి, రీసెర్చి క్యాంపస్ వైద్య పరిశోధకులు డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్‌లు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎముకలకు రక్తప్రసారం తగ్గి సూక్ష్మ ఫ్రాక్చర్లతో (ఎముకలు చిట్లడం) కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వైద్యులు తెలిపారు. తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మ్యుకార్ మైక్రోసిస్ మాదిరిగానే, కరోనా చికిత్సలో భాగంగా మందులు, ఔషధాలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రకం కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు వృద్ధులు, వయసు పైబడిన వారిలోనే కాకుండా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించిన యువతలోనూ బయటపడొచ్చునంటున్నారు. కోవిడ్ చికిత్స అనంతరం 50, 60 రోజుల్లో ఏవీఎన్ కొందరిలో బయటపడొచ్చని, మరికొందరిలో కనిపించడానికి ఆరు నెలల నుంచి ఏడాది కూడా పట్టొచ్చునని డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ వెల్లడించారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఏవీఎన్‌కు సంబంధించిన లక్షణాలు తొలుత ఎమ్మారై పరీక్షల్లో బయటపడతాయని, తదనంతర పరిస్థితుల్లో ఎక్స్‌రే రేడియోగ్రాఫ్లోనూ గుర్తించొచ్చునని చెప్పారు. దీని మొదటిదశ లక్షణాల్లో భాగంగా నడుం, గజ్జలు, వెన్నెముక, భుజం నొప్పులు కనిపించొచ్చునని, వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై జాయింట్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందువల్ల తొలిదశలోనే దీనిని గుర్తించి అప్రమత్తమైతే అది తీవ్రస్థాయికి చేరకుండా అరికట్టొచ్చుని స్పష్టం చేశారు. ఎముకల జాయింట్ల నొప్పులు పెరుగుతున్నప్పుడు, ఈ నొప్పులు ఆగకుండా కొనసాగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ డాక్డర్లను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ సూచించారు. -
ఓవైసీ ఆస్పత్రికి భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే
-
అయ్యో.. చనిపోయింది నా కొడుకేనా!
ఓ కన్నతండ్రి గుండె కోత.. విధి ఆడిన వింత నాటకం సెక్యూరిటీ సూపర్వైజర్: ‘హలో.. సార్.. మీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఒకరు చనిపోయారు.. ఇద్దరు గాయపడ్డారు.. వారిని ఆసుపత్రికి తెచ్చారు.. మీ ఎస్సైని ఆసుపత్రికి పంపించండి..’ పోలీసులు: ఇప్పుడే వస్తున్నాం..! కాసేపటి తర్వాత.. పోలీసులు వచ్చారు.. క్షతగాత్రులు, మృతుడి వివరాలు రాసుకుంటున్నారు.. సూపర్వైజర్ అక్కడే ఉన్నాడు.. పోలీసులు బైక్ నంబర్ రాశారు.. మృతుడి పేరు రాశారు.. ఆ వివరాలు చూడగానే పక్కనే ఉన్న సూపర్వైజర్కు గుండెలో పిడుగుపడింది! ఎందుకంటే ఆ బైక్ తన కొడుకుదే! చనిపోయింది ఎవరో కాదు.. ఆయన కొడుకే!! ‘అయ్యో దేవుడా... నా కొడుకు చనిపోయాడని నేనే పోలీసులకు చెప్పుకున్నానా..’ అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. విధి ఆడిన ఈ వింత నాటకానికి హైదరాబాద్‌లోని ఒవైసీ హాస్పిటల్ వేదికైంది. నోట్ బుక్ కోసమని వెళ్లి.. నగరంలోని రియాసత్‌నగర్ దర్గా బర్హానే షా ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీం సంతోష్‌నగర్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఈయన కుమారుడు మహ్మద్ అబ్దుల్ ఆసీం(14) స్థానికంగా ఉన్న మాగ్నటిక్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఆసీం.. ఇద్దరు స్నేహితులు మహ్మద్ అబ్రార్(14), మహ్మద్ ఫౌజెన్(14)లతో కలసి చాంద్రాయణగుట్టలో ఉన్న మరో స్నేహితుడి ఇంటికి నోట్‌బుక్ తీసుకునేందుకు మ్యాస్ట్రో ద్విచక్ర వాహనం (ఏపి 11ఏటి7352)పై వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయల్దేరారు. డీఎల్ఆర్ఎల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో (ఏపి09బిజి1867) వీరి వాహనాన్ని ఓవర్టేక్ చేసి అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల ద్విచక్ర వాహనం స్కార్పియోను ఢీకొంది. ముగ్గురు విద్యార్థులు ఎగిరి అవతలి వైపు రోడ్డులో పడిపోయారు. అటుపక్క వస్తున్న స్కార్పియో (ఏపీ 09 సి ఇ 3131) కింద పడబోయారు. కానీ డ్రైవర్ బ్రేక్‌లు వేశాడు. వెంటనే అదే వాహనంలో వారిని సమీపంలోనే ఉన్న ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ఆసీం మృతి చెందాడు. ఈ విషయాన్ని అదే ఆసుపత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్న అలీం స్వయంగా చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వచ్చి వివరాలు రాసుకుంటున్న సమయంలో.. అందులో తన కుమారుడి పేరు, బైక్ నంబర్ చూసిన అలీం కుప్పకూలాడు. వెంటనే వార్డులోనికి వెళ్లి కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. - హైదరాబాద్