own son died
-
కొడుకును తాళ్లతో కట్టేసి..కిరోసిన్ పోసి..
-
కన్న పేగునే కాల్చేశారు
దామెర: మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి మహేష్ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలను ఆర్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్ఐ యు.భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గుండెకోత..
శంకర్పల్లి, న్యూస్‌లైన్: కన్న కొడుకు మృతిని ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. కుమారుడిపై గుండెల నిండా గూడు కట్టుకున్న మమకారం తల్లడిల్లిపోయింది. అతని మరణవార్త విన్న ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండె ఆగిపోవడంతో విగతజీవిగా మారింది. తల్లీకొడుకు ఒకే రోజు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఆదివారం మండలంలోని మహాలింగపురం అనుబంధ గ్రామం బయన్నగూడలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఏనుగు లక్ష్మారెడ్డి (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటలకు లక్ష్మారెడ్డి చేనుకు వెళ్లాడు. పొలం పనుల్లో నిమగ్నమైన ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. పొరుగు రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో నగరంలోని నిమ్స్‌కు తరలించే యత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే లక్ష్మారెడ్డి ప్రాణాలు విడిచారు. కుమారుడి మరణవార్త విన్న ఆయన తల్లి రత్నమ్మ (80) తీవ్ర ఉద్వేగానికి గురై గుండెలు బాదుకుంది. కొద్దిసేపటికే ఆమె అసువులు బాసింది. తల్లీకొడుకుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లక్ష్మారెడ్డికి భార్య లలిత, కుమారుడు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామంలో తల్లీకొడుకులకు అంత్యక్రియలు నిర్వహించారు.