కిరోసిన్ పోసుకుని విద్యార్థి ఆత్మహత్య
వలిగొండ(నల్గొండ జిల్లా): వలిగొండ మండలం గోకారం గ్రామంలో పి. భానుప్రసాద్(17) అనే బాలుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్లోని అర్జున్ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అయితే సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన మారుతీ, కార్తీక్ అనే ఇద్దరు వేధించటం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడ ని ప్రసాద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రసాద్ తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.