హువావే నుంచి..‘పీ9’ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: ప్రపంచపు మూడో అతిపెద్ద మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘పీ9’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.39,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నాణ్యమైన సిగ్నల్స్ కోసం మూడు యాంటినాలను పొందుపరిచామని, దీని వల్ల కాల్ డ్రాప్స్ తగ్గుతాయని కంపెనీ పేర్కొంది. ఇక ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.2 అంగుళాల స్క్రీన్, 4జీ, డ్యూయెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యూయెల్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్లను ఆన్లైన్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కాగా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘మెట్బుక్’, ‘టాల్క్‌బాండ్ బీ3’ అనే రెండు ట్యాబ్లెట్ పీసీలను కూడా ఆవి ష్కరించింది. ఇవి త్వరలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.