ఎయిర్‌సెల్ 5 రూపాయల పథకం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌సెల్ రూ.5కే అయిదు రకాల వాయిస్ పథకాలను ప్రకటించింది. ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని స్థానిక కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ మరియు ఎస్టీడీ 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు ఐఎస్డీ పథకాన్ని కూడా రూపొందిం చింది. ఈ అయిదు పథకాల్లో కస్టమర్లు ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. పథకాన్నిబట్టి 10 రోజుల నుంచి 30 రోజుల దాకా వ్యాలిడిటీ ఉంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచితం, అన్ని స్థానిక కాల్స్ పథకాల్లో ప్రతి రోజు తొలి 120 సెకన్లకుగాను సెకనుకు 1.5 పైసలు చార్జీ చేస్తారు. లోకల్ మరియు ఎస్టీడీ ప్లాన్‌లో ప్రతి రోజు తొలి 120 సెకన్ల కు సెకనుకు 2 పైసలు చార్జీ ఉంటుంది.
ట్రయల్ రన్లో 4జీ: రాష్ట్రంలో 4జీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపిందర్ తివానా శుక్రవారమిక్కడ తెలిపారు. వాణిజ్యపరం గా సేవలు అందించేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. వాస్తవానికి 4జీ ఆధారిత మొబైల్ ఫోన్ల లభ్యత దేశంలో తక్కువగా ఉందన్నారు. వాయిస్ పథకాలను ప్రకటించిన అనంత రం కంపెనీ దక్షిణ ప్రాంత మార్కెటింగ్ హెడ్ భరత్ మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.