45 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం
ఇద్దరు నిందితుల అరెస్టు
షాద్నగర్ : ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 45 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. షాద్నగర్ బస్టాండు సమీపంలోని రాజు ఇంట్లో గంజాయి అమ్ముతున్నట్టు స్థానికులు కొందరు ఎక్సైజ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బుధవారం ఉదయం సీఐ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసి 24 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నావని నిందితుడిని ప్రశ్నించగా కొత్తూరు నుంచి బదులిచ్చాడు. అనంతరం అక్కడి దొండి రాం ఇంటిపై దాడిచేసి మరో 21 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, గౌస్, సుల్తాన్, వెంకటేశ్వర్లు, రామారావు పాల్గొన్నారు.