Padma vasireddy
-
ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు
• బాబు బాటలోనే మంత్రులు.. • వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగాలపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపో యిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రు లు, ఎమ్మెల్యేలు బేరసా రాలకు దిగుతున్నా రని మండిపడ్డారు. ఆమె బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సిద్ధాంతాల్లో భాగంగా మారిందని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ పదవిని టీడీపీ ప్రలోభాలతో లాక్కుకున్నారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు. ‘పోలవరం’కు సంబంధించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉమ అన్నారని పద్మ విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటే, పోలవరం కడుతుంటే జగన్ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యముంటే జగన్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. -
కుంభకోణాలవల్లే మాట్లాడ్డం లేదు
{పత్యేక హోదాపై చంద్రబాబు తీరును విమర్శించిన వాసిరెడ్డి పద్మ ఆయన కేంద్రాన్ని నిలదీయలేరు.. వారంటే ఆయనకు భయం.. ‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కున్న బాబు ఢిల్లీముందు సాగిలపడ్డారు.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు హైదరాబాద్: తాను చేస్తున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు తనపై ఎలాంటి విచారణలు, కేసులు లేకుండా ఉండేందుకే సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేకహోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేరని, ఆయనకు వారంటే భయమని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఢిల్లీ ముందు సాగిలపడి తనపైకి రాకుండా చేసుకున్నారని, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆ కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంటుందో లేదో తెలియని దశలో ఉందని ఆమె చెప్పారు. అవసరం లేకున్నా పోలవరాన్ని నీరుగార్చేలా పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని పద్మ ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని, జపాన్, సింగపూర్ ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారినుంచి లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపైనా విచారణ జరిగితే చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని, అందుకనే కేంద్రంతో పోరాడాలంటే భయపడుతూ.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్రప్రజలు ఎటుపోయినా, విద్యార్థులు, నిరుద్యోగులు ఎటుపోయినా ఆయనకు పట్టదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న వారి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి ప్రత్యేకహోదాపై మాట్లాడ్డం లేదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల్ని ఎందుకుమభ్యపెడుతున్నారు? ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని ఓవైపు కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా తెగేసి చెబుతూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు ప్రత్యేకహోదా వస్తుందని ఇంకా ప్రజల్ని ఎందుకు మభ్యపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రత్యేకహోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని, వారి ఎంపీయే ఆ విషయం బయటకు చెప్పారని ఆమె గుర్తు చేశారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఏపీకి సంబంధించింది కాదంటున్న చంద్రబాబు.. తాను స్వయంగా ఢిల్లీకెళ్లి ఎన్డీయే పెద్దల్ని కలసి ఆ ప్రకటన ఏపీకి సంబంధించింది కానే కాదని ఎందుకు చెప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టర్కీకి వెళ్లేబదులు తన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డున ప్రత్యేకహోదాపై ఎన్డీయే సర్కారును నిలదీయాలని పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మౌనం వహించినా తాము మాత్రం పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. -
ఏం చేశారని నవనిర్మాణ దీక్ష?
చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాదిలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేపడతారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ 11 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. విభజనకు లేఖలిచ్చిన వ్యక్తి విధ్వంసం పునాదులపై నవనిర్మాణం చేస్తారా? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ విషయంలో నిలువునా మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయమంటూ కుచ్చు టోపీ పెట్టారని, నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేశామని చెప్పి మీడియా ప్రచారంతో కాలం గడిపారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రావడానికి తానే కారణమని ఆ ప్రాంతంలో ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు విభజన హామీల్లో ఒక్కటైనా ఈ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోగలిగారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చే సేసినట్లుగా పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాయించుకున్నారని... అసలు ఎంతమేరకు, ఎప్పటివరకు రుణాలు మాఫీ చేస్తారనే విషయమే ఎక్కడా అధికారికంగా చెప్పలేకపోయారని తూర్పారబట్టారు. దివంగత వైఎస్ హయాంలో పావలా వడ్డీకే రుణాలు పొందిన మహిళలు చంద్రబాబు మాటలు విని మోసపోయి, ఇపుడు రుణాలు లేనిస్థితిలో ఉండి పోయారన్నారు.